control angry

ఆగ్రహం అనర్థమే . . . నవ్వుతూ ఉండండి . . .

కొందరికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అందరి పైన విరుచుకు పడుతుంటారు. చేతిలోని వస్తువులను విసిరేస్తూ ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఇలా చీటికిమాటికి ఆపుకోలేని కోపంతో ఊగిపోతూ ఉండటాన్ని ఇంటర్ మీటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు.

ఇలాంటి ప్రవర్తన గల వారికి రక్తంలో వాపు సూచికలు అయినా సి రియాక్టివ్  ప్రోటీను ,ఐ ఎల్-6 ఎక్కువ మోతాదులో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే వాపు మూలంగా కోపం ప్రేరేపితం అవుతోందా ,  లేదంటే కోపం తో కూడిన భావన మూలంగా వాపు ప్రేరేపితం అవుతోందా తేలలేదు కానీ ఈ రెండిటికీ మాత్రం బలమైన సంబంధం ఉండటం మాత్రం నిజం అని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ గారు చెప్తున్నారు.

వాపు మూలంగా మధుమేహం , క్యాన్సర్ వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మన కాలేయం ప్రతిస్పందించి CRP ని ఉత్పత్తి చేస్తోంది.

రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి తెల్లరక్తకణాలు ఐ ఎల్-6 ను విడుదల చేస్తుంది.

సాధారణంగా వాపు ప్రతిస్పందన ప్రేరేపితమైనప్పుడు రక్తంలో వీటి మోతాదులు పెరుగుతాయి.

బాధితులు ఒత్తిడితో కూడిన సందర్భాలు ఎదురైనపుడు తీవ్ర కోపంతో ఊగి పోతూ ఉంటారు .

కోపం కుటుంబ జీవితంలో పాటు, ఉద్యోగ నిర్వహణలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి తరచూ అనవసరంగా అతిగా కోపం తెచ్చుకుంటే అది ఆయా వ్యక్తుల స్వభావం గా భావించి కొట్టిపారేయకండి. ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది.

error: Content is protected !!