ప్రతి ఒక్కరు ముఖ సౌందర్యం కోసం చాలా తపన పడుతూ ఉంటారు. ముందుగా మన చర్మం యొక్క తత్వాన్ని తెలుసు కోవాలి. మన చర్మం పొడి చర్మం లేదా ఆయిల్ స్కిన్ అన్నది తెలుసుకోవాలి . దాన్ని బట్టి మనం ఈ క్రింద చెప్పిన విధంగా మీరు ఫేస్ ప్యాక్ వేసుకునట్లు అయితే మీకు మంచి ముఖ సౌందర్యం లభిస్తుంది .
పొడిబారిన చర్మానికి:
ఐదు చెంచాల చొప్పున అరటిపండు పొడి, పాలపొడి, మొక్కజొన్న పిండి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి.
ముఖానికి వేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని, పాలతో పేస్టులా చేసుకుని, ముఖానికి రాసుకోవాలి.
ఈ ప్యాక్ వల్ల చర్మం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది .చర్మాన్ని తాజాగా మారుస్తుంది. బజార్లో బొప్పాయి, స్ట్రాబెర్రీ, ద్రాక్షపొడి దొరుకుతాయి.
జిడ్డు చర్మానికి :
రెండు చెంచాల ముల్తాని మట్టి ,చెంచా మొక్కజొన్న పిండి ,రెండు చెంచాల కీరదోసకాయ పొడి తీసుకుని అన్నింటినీ కలిపి భద్రపరుచుకోవాలి.
ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు ద్రాక్ష రసంతో కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పూతలా రాసుకోవాలి.
సున్నితమైన చర్మానికి:
రెండు చెంచాల పాల పొడి, రెండు చెంచాల గోధుమ రవ్వ, రెండు చెంచాలు మొక్కజొన్నపిండి, చెంచా ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా పొడి తీసుకుని, అందులో బొప్పాయి లేదా పుచ్చకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి.