beauty tips in telugu

మెరిసే సౌందర్యం కోసం . . .

చర్మాన్ని తాజాగా మార్చి, మెరిపించడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటాము చాలామంది .  మీ చర్మ సౌందర్యం అందంగా ఉండాలంటే  ఇవి ప్రయత్నించి చూడండి . చాలా సహజమైన పద్దతులులో సహజ సౌందర్యం మీ సొంతం . . .

5-6 ద్రాక్షపండ్లను తీసుకుని ముఖం మీద రుద్దుకోవాలి . కొంచెం సమయం దాటాకా కడగాలి . లేదంటే  ద్రాక్షపండ్లను గుజ్జులా చేసి ముఖానికి రాసుకున్నా కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

రెండు మూడు చెంచాల గంధం లో కొద్దిగా పసుపు వేసి,పాలతో పేస్టులా తయారు చేసుకుని ముఖానికి పట్టించాలి. ఒక పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా మంచినీళ్లతో కడిగేసుకోవాలి .చర్మం సహజంగా మెరుస్తోంది. దాంతో పాటు చర్మం తాజాగా ఉంటుంది

చర్మాన్ని మెరిపించడం తో పాటు మృదువుగా మార్చాలంటే పాలు,  తేనె సరైన ఎంపిక. ఈ రెండిటినీ కలిపి రాసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఎంతో మంచి ఫలితం మీ సొంతం అవుతుంది .

తాజా పాలల్లో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయాలి .కాసేపయ్యాక దూదితో తుడి చేసుకుంటే  సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది.

టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రాసుకోవాలి.పూర్తిగా ఆరాక దూదితో తుడి చేసుకుని తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. దీని వల్ల చర్మం మృదువుగా నే కాకుండా తాజాగా కూడా కనిపిస్తుంది.

error: Content is protected !!