benefits of grapes

పోషకాల ద్రాక్ష . . .

ద్రాక్ష పండ్లను తరచూ తినడం వల్ల ఎ, సి , బి6 లాంటి విటమిన్లతో పాటూ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలను కూడా పొందవచ్చు.

చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి .

ఆరోగ్యానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ను దూరం చేస్తాయి.

అంతే కాకుండా చర్మం చాలా తాజాగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి .

ఈ పండ్లను ఎక్కువగా తినడం వలన మలబద్ధకం ,అజీర్తి, అలసట,మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

కండరాలు కూడా దృఢంగా ఉంటాయి. ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల కూడా  ఈ సమస్యలు తగ్గుతాయి.

అధ్యయనాల ప్రకారం ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

బాగా నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తి కోసం ద్రాక్ష రసం తీసుకుంటే మంచిది.

ద్రాక్ష పళ్ళని రోజు వీలు ఉన్నపుడు తీసుకోండి.

error: Content is protected !!