breakfast

రోజు  తిందాం అల్పాహారం . . .

మరి పనులతో క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలో ఆకలి వేయడం మనలో చాలామందికి అనుభవమే.

ఆ సమయంలో మనస్సు ఓ పెద్ద సమోసా ,సాస్ తో పాటు కర్రీ పఫ్ లాంటివి తినాలి అనిపిస్తుంది .

ఇకపై వాటిని మానేద్దాం. బదులుగా పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్, క్యారెట్ ,పెరుగు, కూరగాయ ముక్కలు కలిపి చేసుకుని సలాడ్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వండి .

చీజ్, క్రీం  లాంటివి లేకుండా తయారు చేసిన శాండ్విచ్ ఎంచుకున్న మంచిదే.

పోషకాలు అందడమే కాదు కెలోరీల భయం కూడా ఉండదు.

రకరకాల పనులతో, క్షణం తీరిక లేకుండా గడిపే స్త్రీలు ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది అల్పాహారం.

సమయం లేకపోతే ఏదో ఒకటి తప్ప ,ప్రత్యేకంగా పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టారు.  

ఆ నిర్లక్ష్యమే రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి కారణమవుతుంది.

ఆహార విషయంలో కొన్ని మార్పులు చేస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

 సమయం లేకపోవడం వల్ల కావచ్చు, బరువు పెరుగుతామనే భయంతో కావచ్చు.

చాలామంది అమ్మాయిలు ఉదయం పూట అల్పాహారం తినకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు అనుకుంటారు.

కానీ అల్పాహారం తీసుకోకపోవడం వలన జీవ క్రియల పనితీరు చురుగ్గా సాగదు.

అంతేకాకుండా మధ్యాహ్నం అవసరానికి మించి తినేస్తాం.

దాంతో బరువు పెరుగుతారు. భారీగా తినడం వల్ల చురుగ్గా పని చేయలేని పరిస్థితి ఎదురవుతుంది.

అందుకే ఏదో ఒకటి ఉదయం పూట రెండు ఇడ్లీలు, దోస ,కప్పు ఓట్స్ ఏదైనా ఒక పండు ఇలా ఏదో ఒకటి తీసుకోవాలి.

మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకుంటే మరీ మంచిది.

 చాలా మంది మహిళలు మంచినీళ్లు ఎక్కువగా తాగరు.

అది డిహైడ్రేషన్ కే కాదు, చర్మ పొడిబారడానికి ,మూత్రనాళ ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతుంది.

ఒకవేళ ఈ సమస్య మీదైతే ఇక నుంచి అయినా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

దాహం వేసినా వేయకపోయినా, అప్పుడప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగుతూ ఉండండి.

వీలైనంత వరకు నూనె,చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలు తక్కువ తీసుకుంటూ, తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు  ఎక్కువగా తీసుకుంటే అనుకున్నట్లుగా సన్నబడడం అంత కష్టమైన పనేమీ కాదు.

error: Content is protected !!