ఆరోగ్యంగా పండంటి బిడ్డ కి ‘జన్మ’ ఇవ్వాలంటే . . .

ప్రతి కుటుంబంలోనూ ఆనందపడే ఒక క్షణం ఒక బిడ్డ పుట్టినప్పుడు’ . ఆ బిడ్డ పుట్టే ముందు . . .ఆ నవమాసాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి , ఏ విధమైన ఆహారం తినాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు మీ కోసం .

ప్రతి గర్భిణీ తీసుకోవలిసిన ముఖ్యమయిన జాగ్రత్తలు :

ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  తినేటటువంటి ఏ ఆహారమైనా ఇష్టపడి తినాలి. బిడ్డకు కావలసినటువంటి పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

సమృద్ధిగా పోషకాలు లభ్యమయ్యే కొన్ని ఆహార పదార్థాలు :  

 • సజ్జలు,  బార్లీ,  కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, ఒరుగులు, ముడి బియ్యం,  తెల్ల బియ్యం, గోధుమలు, మొలకెత్తిన గోధుమలు వంటి చిరు ధాన్యాలు.
 • శనగలు, మినుములు, వేపుడు శనగపప్పు, బొబ్బర్లు, చిక్కుడుగింజలు, పెసలు, ఉలవలు, కందిపప్పు,  పెసర పప్పు, సోయాచిక్కుడు వంటి గింజధాన్యాలు.
 • బాదం పప్పు, జీడిపప్పు , వేరుశనగ పప్పు ,పిస్తా పప్పు, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు , పుచ్చకాయ పప్పు 

పైన పేర్కొనబడిన చిరు ధాన్యాలు , గింజ ధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఇంకా చేపలు , మాంసం, గుడ్లు , పాలు లో కూడా ఉంటాయి. కాని ఏది అయిన మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, ఇష్టపడేది తీసుకోవాలి.

 • పండ్లు ఎక్కువగా తినాలి.  పండ్ల నుంచి పోషకాలతో పాటు, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా లభ్యమవుతాయి. దీని వల్ల మల బద్ధకం సమస్య రాదు .

హార్మోన్ల మార్పుల వలన వాంతులు, వికారంతో వేవిళ్ళు తీవ్రంగా ఉంటాయి. నీరు తగ్గి పోవడం, విపరీతమైన నీరసం వంటి సమస్యలు ఉంటాయి. కంగారు పడక్కర్లేదు. ఈ వేవిళ్ళు సాధారణంగా రెండు నుంచి మూడు నెలల లోపు సర్దుకుంటాయి

ఈ వేవిళ్ళు సమస్య నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు :

కడుపు ఖాళీగా ఉంటే వికారం పెరుగుతుంది కాబట్టి ఏదో ఒకటి  తరుచు గా తినాలి. ఉదయం మంచం మీదనే ఏదో ఒకటి పండు తిని , కొద్ది సేపు ఆగి లేవాలి. ఆహారం కొద్ది కొద్ది గా ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల వికారం తగ్గుతుంది.

వికారం అనిపిస్తే నిమ్మ, ఉసిరి,అల్లం వంటివి తింటూ ఉండాలి .  అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందులు వాడవచ్చు.నీరు త్రాగడం ఎవరికైనా మంచిది. గర్భిణీలకు చాలా మంచిది . మీకు సరిపడా నీరు త్రాగండి .

మానసిక , శారీరక ఆరోగ్యానికి . . .

మనలో కలిగే ప్రతి భావోద్వేగం ఎన్నో మార్పులను మనలో కలుగజేస్తుంది. ఎప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపడమనేది బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది.

 • గర్భిణీలు అధిక విశ్రాంతి తీసుకోవడం వలన మధుమేహం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోజు రాత్రి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

పక్కకు తిరిగి పడుకోవటం, కాళ్ళ మధ్య దిండు పెట్టుకోవడం వల్ల సౌకర్యంగా ఉండి, నిద్ర బాగా హాయిగా పడుతుంది. తేలికపాటి వ్యాయామం చేయాలి.ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల నడుము నొప్పి, అలసట, కాళ్లవాపులు వంటివి కొంచెం తగ్గుతాయి.

 • నడక,  తేలిక పాటి యోగ అనేది గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది.
 • పొగాకు మద్యం మాదక ద్రవ్యాలు సేవించే వారికి , అటువంటి పరిసర ప్రాంతాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి.

శారీరకంగా శ్రమ, ఒత్తిడి లేని ఉద్యోగాలు అయితే నెలలు నిండే వరకు చేయవచ్చు. నిలబడి చేసే ఉద్యోగాల అయితే 24 వారాల నుంచి మానేయడం మంచిది. రాత్రిపూట షిఫ్టుల్లో పని చేసే మహిళా ఉద్యోగులు వైద్యులు ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

వైద్య పరీక్షలు , మందులు :  

తల్లి ఆరోగ్యానికి, సుఖ ప్రసవం జరగడానికి దంత సమస్యలు ఏమీ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. గర్భం ధరించడానికి ముందే ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం మంచిది.

 • గర్భం దాల్చిన 4 నెలల లోపు అయినా సరే దంత పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు నెలల తర్వాత మనం ఎక్సరేలు, యాంటీ బయోటిక్స్ వాడటం మంచిది కాదు.

గర్భం రాగానే వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సూచిస్తారు. రక్త , మూత్ర పరీక్షలు చేస్తారు . ఏదైనా సమస్య ఉంటే ముందే గుర్తించడానికి, వైద్య పరీక్షలు చేసి తల్లి బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చికిత్స అందిస్తారు.

 • 26 నుండి 28 వారాల మధ్యలో గర్భిణికి గ్లూకోజ్ తాగించి మధుమేహాన్ని గుర్తించడానికి చేసే రక్తపరీక్ష పేరు జి సి టి.
 • 32 వారాలప్పుడు మరోసారి సంపూర్ణ రక్త పరీక్ష చేస్తారు. 36వ వారం లో మరోసారి షుగర్ పరీక్ష చేయిస్తారు.

ఫోలిక్ యాసిడ్ మాత్రలు గర్భం దాల్చిన దగ్గరనుంచి కాన్పు అయ్యే వరకు కూడా తీసుకోవాలి. ఐరన్ మాత్రలు మూడో నెలలో ఆరంభించి కాన్పు తర్వాత మూడు నెలలు వరకు కొనసాగించాల్సి ఉంటుంది. కాల్షియం మాత్రలు ఐదో నెల లో ఆరంభించి చివరలో బిడ్డకు పాలు ఇచ్చి నంత కాలం కొనసాగించాలని ఉంటుంది.

గర్భిణీలు అత్యవసరమైతే పారాసెట్మాల్ తప్ప వైద్యుని సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు

 • మధుమేహం, థైరాయిడ్, ఆస్తమా, ఎలర్జీ సమస్యలు ఉన్నా సరే పిల్లలను కనవచ్చు. కాని వైద్యులు ని సంప్రదించటం వలన సరైన చికిత్సను అందించగలరు.

గర్బిణి లు వైద్యుల సలహా మేరకు మీకు సంబంధించిన వ్యాధికి మందులు వేసుకుంటూ, బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూసుకోవచ్చు.థైరాయిడ్ వంటి సమస్య ఉన్నవారు నెలలు నిండే కొద్ది బరువు పెరగడం వలన మందుల మోతాదులు పెంచవలసి ఉంటుంది.

కాబట్టి గర్భం దాల్చిన తర్వాత, కాన్పు తర్వాత కూడా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించ వలసి ఉంటుంది.

గర్భిణీలు విషయంలో స్కానింగ్ అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది.

 • మూడు స్కానింగులు చెయ్యటం చాలా ముఖ్యం.
 • మూడవ నెలలో చివర్లో  ఒక స్కానింగ్ చేస్తారు . ఈ స్కానింగ్ పేరు ఎన్ టి స్కాన్. దీని యొక్క ఉపయోగం పిల్లల్లో జన్యు సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షిస్తారు.
 • 18 నుండి 20 వారాలప్పుడు చేసే అనామలి స్కానింగ్ లో బిడ్డకు శరీర నిర్మాణ పరమైన లోపాలను గుర్తించడానికి వీలు అవుతుంది.
 • ఏడవ నెల చివరలో చేసే  స్కానింగ్ – బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో చూసే గ్రోత్ స్కాన్ . ఇది తప్పక చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు

ఆరు నెలలు నిండేవరకు నెలకొకసారి , 28 నుండి 36 వారాల వరకు రెండు వారాలకు ఒకసారి , 36 వారాల తర్వాత కాన్పు అయ్యే వరకు వారానికి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించాలి. బరువు, బిపి , చెక్ చేస్తారు. కాళ్ల వాపు ఉందేమో గమనిస్తారు. బీపీ పెరుగుతూ కాళ్ల వాపు గనక ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్త . ముఖం ఉబ్బిన,  కళ్ల చుట్టూ వాపు వచ్చినా,  చేతులు వాచిన, కాళ్ళు వాచిన  వైద్యులను సంప్రదించవలెను.

 • గర్భిణీలు జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే పోషకాహార లోపం లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించడం మంచిది.
 • సాధారణంగా గర్భిణీలకు జుట్టు రాలదు. ఒకవేళ ఉన్న చాలా తక్కువగా ఉంటుంది.

కొన్ని  ముఖ్యమయిన జాగ్రత్తలు :

మొదటి మూడు నెలలు, ఆఖరి మూడు నెలలు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. 3 నుంచి 6 నెలలు మధ్య ప్రయాణం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.ఎక్కువ సమయం పట్టే ప్రయాణాలకు రైలు ప్రయాణాలు ఉత్తమం. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

 • గర్భిణీలు వేరే ఊరు వెళ్ళినప్పుడు మొత్తం మెడికల్ రికార్డు తీసుకువెళ్లాలి.
 • గర్భిణీలకు నెలలు నిండితే , బిడ్డ పెరుగుతున్న కొద్దీ కడుపు కండరాలు సాగుతూ పొట్ట పెరుగుతూ ఉండటం వలన వెన్ను మీద భారం పెరిగి నడుము నొప్పి అనేది సహజం.

భుజాలు కొద్దిగా వెనక్కి పెట్టుకుని నిటారుగా నిలబడటం,కూర్చునేటప్పుడు వెనక ఒక మెత్తని దిండు పెట్టుకోవటం, పాదాల కింద ఎత్తు పెట్టుకోవడం చెయ్యాలి . కాళ్లను మడత పెట్టి కూర్చోకూడదు.

 • సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడి ఉండిపోకుండా కదులుతుండటం, వస్తువులను కింద నుంచి ఎత్తేటప్పుడు వంగకుండా జాగ్రత్త వహించడం, ఎత్తు లేని చెప్పులు వాడటం, నడుముకి వేడినీటి కాపడం పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

We hope every pregnant women deliver a healthy baby with this precautions.

మీ అందరికి ఈ విషయాలు ఉపయోగ పడాలని ఆశిస్తూ , పండంటి బిడ్డకు జన్మ నివ్వాలని మనస్పూర్తిగా కోరుకొంటూ . . . మీ పిల్లల చిరునవ్వులులో మీ ఆనందం చూడాలని . . .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్.

error: Content is protected !!