benefits of cucumber

కొలెస్ట్రాల్ తగ్గించే కీరదోస . . . తినాలి అందరూ . . .

కీరదోస లో 95 శాతం నీళ్లే ఉంటాయి. ఇది తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.

అంతేకాకుండా శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు, మలినాలు అన్నీ పోతాయి.

సాధ్యమైనంతవరకు చెక్కి తీసి కాకుండా,  మాములుగా  తినడం మంచిదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ‘సి’ విటమిన్ లభ్యమవుతుంది.

అలాగే తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ c శరీరానికి లభిస్తుంది.

కీరదోస లో నీటి శాతం ఎక్కువగా ఉండటం, కెలోరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఒక మంచి ఔషధం.

కీరదోస లో పీచు పదార్థం కూడా ఎక్కువే. అందువల్ల ఇది రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు బాగా మెరుగవుతుంది.

 మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చక్కని మందు అవుతుంది.

అధ్యయనాల ప్రకారం కీరదోస శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

దీనిలో ఉన్న పొటాషియం, మెగ్నీషియం ,పీచుశాతం  అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకే కాదు లోబిపి ఉన్నవారికి మేలుచేస్తుంది .ఇలా కీరదోస రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.

కీరదోస లో ఉండే సిలికా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది .

పైగా బి1, బి6, సి, డి విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

దీన్ని క్యారెట్ తో కలిసి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు .

ఇవన్నీ పోషకాలు అందాలంటే కీరదోసను రోజుకొకటి తినాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు.

error: Content is protected !!