fiber food

ఆస్తమాకు పీచు బంధం . . .

  పండ్లు,కూరగాయలను తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలుసు.

వీటిల్లోని పీచు మలబద్ధకం ,పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది .

పీచుతో కూడిన పదార్థాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి.

దీంతో రక్తంలోకి గ్లూకోజు కూడా నెమ్మదిగా విడుదల అవుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది.

అలాగే రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం మూలంగా తలెత్తే సమస్యలను ఉదృతం కాకుండా చూస్తుంది.

పీచుతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొత్తగా గుర్తించారు. ఇది కొన్ని రకాల రోగనిరోధక కణాల ఉత్పత్తిని పెంచుతూ ఆస్తమాను నివారిస్తున్నట్లు వెల్లడైంది.

మనం తీసుకునే ఆహారం ఎముక మజ్జలో రోగనిరోధక కణాల ఉత్పత్తిని ప్రభావితం చేయగలదని బయటపడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

అందువల్ల పీచు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆస్తమా వంటి వాపు సంబంధ జబ్బుల బారినపడకుండా చూసుకోవచ్చు.

error: Content is protected !!