Control stress

ఒత్తిడి తగ్గించుకోండి . . .

 

బాగా ఒత్తిడి గా ఉంటుంది అని చెప్పడం కాదు దాన్ని అధిగమించేందుకు ఎలాంటి మార్పులు చేసుకోవాలి అన్న దానిపై దృష్టి పెట్టినప్పుడే ఈ సమస్య తగ్గుతుంది .

ఒత్తిడికి గురి అవుతున్నాము అనిపించినప్పుడు వెంటనే వేసుకోవాల్సిన ప్రశ్న . . .

కారణం ఏమిటి అని? కార్యాలయంలో పని భారం?భాగస్వామితో  తగాదా నా ? పిల్లల బాధ్యతలు ? అసలు కారణమేంటో పరిశీలించుకోవాలి.

సరైన కారణం తెలిస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు దానిపై అవగాహన వస్తుంది . దాన్ని ఆచరణలో పెట్టండి .

పని భారం ఎక్కువ అనుకుంటే ఆ విషయాన్ని పై అధికారి తో మాట్లాడండి.

కొన్ని సూచనలు లభిస్తాయి .ఇదే తీరు మిగతా విషయాలకు వర్తిస్తుంది .

అవకాశం ఉన్నప్పుడల్లా అభిరుచులు పై దృష్టి పెట్టండి.

అవును ఇష్టమైన పని చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

అలాగే అది ఎలా అనేది తెలియకపోతే  రకరకాల అంశాలను ఆచరణలో పెట్టండి.

మీకు ఆనందాన్ని ఇచ్చిన వాటిని కొనసాగించండి.

చాలామంది సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోరు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

మీ దినచర్యను పరిశీలించుకుని అనుకున్న సమయానికి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించుకోండి.

సాధ్యమైనంతవరకు దానికి కట్టుబడి ఉండండి.

ఒత్తిడిని తగ్గించుకునే టూల్ కిట్ మీ దగ్గర ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోండి.

అలాగని అదేదో  పనిముట్లు అనుకునే వారు కొన్ని పద్ధతులను ఆచరణలో పెట్టడం  అలవాటు చేసుకోవాలి.

చిరాగ్గా ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పే వారితో మాట్లాడటం, కాసేపు పిల్లలతో కలిసి ఆడుకోవడం, మంచి పుస్తకం చదవడం అలాంటివన్నీ టూల్ కిట్ లో భాగమే.

ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక సారి గమనించండి.

అవసరానికి మించి పనులు కల్పించుకున్నా రా?

కొన్ని అనవసర విషయాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారా? వంటి విషయాలను గమనించి దానికి అనుగుణంగా మీ దినచర్యలో మార్పుల చేసుకోండి.

error: Content is protected !!