బంగాళాదుంపలు వేపుడు . . . ‘ ప్రత్యేకం గా ‘

బంగాళాదుంపలు వేపుడు ఈరోజు నేర్చుకుందాం.

ఈ బంగాళాదుంప వేపుడు ని చపాతీలతో, పూరీలు తో లేదా అన్నంతో కూడా తినవచ్చు. మామూలుగా కూడా తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది.

మీరు ఇంట్లోనే హోటల్లో కంటే రుచిగా బంగాళదుంపలు వేపుడు చేసుకోవచ్చు.

ముందుగా బంగాళదుంపలను కొనేటప్పుడు మీడియం సైజ్ లో ఉన్నవి, మంచిగా ఉన్నవి ఎన్నుకొని కొనవలెను.

ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూద్దాం .

వేపుడు కు కావలసిన పదార్థాలు :

బంగాళాదుంపలు – అరకేజీ , నూనె – 4 చెంచాలు , వెల్లుల్లి రెబ్బలు – 6 , కరివేపాకు రెమ్మలు – 2 , పచ్చిమిర్చి – 6 , జీలకర్ర – అర చెంచా , ఆవాలు – అర చెంచా , కారం – 2 చెంచాలు , ఉప్పు – రుచి కి సరిపడా , ధనియాలు పొడి – అర చెంచా, జీలకర్ర పొడి – అర చెంచా , కొత్తిమీర – కొంచెం.

తయారు చేసుకొనే విధానం వివరం గా : ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా నీటిలో కడగవలెను. తర్వాత బంగాళదుంప మీద ఉన్నట్టు వంటి తొక్కని చెక్కవలెను. 

ఇప్పుడు బంగాళదుంపలను వేపుడు కు తగినట్టుగా చిన్న ముక్కలుగా ఒకే సైజులో తరిగి పెట్టుకోవాలి.

ఇలా తరిగిన ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచవలెను.

ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేసి కాసేపు మరిగిన తరువాత మొదట వెల్లుల్లి రెబ్బలు కొంచెం చితక్కొట్టి వెయ్యాలి.

వీటితోపాటు ఆవాలు, జీలకర్ర కూడా వేసి కాసేపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.

ఇలా వేయించిన వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి ని విడిగా గిన్నె లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ నూనె లో తరిగిన బంగాళదుంప ముక్కలు ఉప్పు నీటిలో నుంచి తీసి నీళ్లు లేకుండా ఆ ముక్కలను కడాయిలో వేసి వేపుడు చేయవలెను.

ఈ బంగాళదుంప ముక్కలను బంగారు వర్ణం వచ్చేంతవరకు ఐదు నుంచి పది నిమిషాలు నూనెలో డీప్ ఫ్రై చేయవలెను.

బంగాళా దుంప ముక్కలు ఫ్రై అయిన తరువాత , ఇక్కడ ఎక్కువ అయిన నూనె ని వేరుగా గిన్నె లోకి తీసేయండి.

ఇప్పుడు బంగాళా దుంప ముక్కలు లో కారం వేసి కాసేపు ఫ్రై చేయాలి.

తరువాత తగినంత ఉప్పు కూడా వేసి కలిపి , చివరగా జీలకర్ర పొడి , ధనియాల పొడి వేసి ఫ్రై చెయ్యాలి .

ఇప్పుడు విడిగా గిన్నె లోకి తీసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి , వెల్లుల్లి కూడా వేసి బంగాళాదుంప ముక్కలు లో కలపాలి.

ఇప్పుడు పైన తరిగిన కొత్తిమీర కొద్దిగా చల్లి , వేడి వేడి గా గిన్నె లోకి తీసుకుంటే బంగాళా దుంపల వేపుడు మీ కోసం సిద్ధం.

కొన్ని చిట్కాలు ఈ కూర కోసం :

బంగాళా దుంపల వేపుడు చేసేటపుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవడం మంచిది . ఉప్పు నీటి లో ముక్కలు కడగడం వలన వేపుడు కర కర లాడుతూ రుచి గా ఉంటుంది .

వేపుడు కి నూనె కొంచెం ఎక్కువ పడిన, డీప్ ఫ్రై అయిన తరువాత ఎక్కువ అయిన నూనె ని వేరు గా గిన్నె లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వలన కూడా వేపుడు బాగుంటుంది .

How to cook Aloo fry or Bangala dumpa vepudu or Potato French fry style

ఈ కూర వండుకుని , మీ కుటుంబ సభ్యులు తో ఆనందం గా భోజనం చేయండి .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!