ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
https://psc.ap.gov.inఈ ప్రక్కన పొందు పరిచిన వెబ్ సైట్ లో మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి .
దీనికి సంబంధించి మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడి అవసరం
27/12/2018 నుండి 18/01/2019 వరకు మధ్య తేదీలలో ఎప్పుడైనా మీరు ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
చివరి తేది 18/01/2019 .
పంచాయితీ సెక్రెటరీ పరీక్ష రెండు దశలు లో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష జరుగు తేది 21/04/2019. ఈ పరీక్ష లో ఉత్తీర్ణులు అయినవారు తదుపరి జరిగే మెయిన్ పరీక్షకు అనుమతించబడతారు.
మెయిన్ పరీక్ష జరుగు తేది 02/08/2019. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు పంచాయితీ సెక్రెటరీగా నియమింపబడతారు.
పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగానికి కనీస అర్హత డిగ్రీ చదువుకొని, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు ఉన్నవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
రిజర్వేషన్ బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
ఈ పరీక్షకు ఫీజు 250 రూపాయలు ఆన్ లైన్ లో చెల్లించవలసి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నవారు కేవలం 80 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది
మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు .
https://psc.ap.gov.in/UI/UserManuals/LatestNotifications/13_2018.pdf
ధన్యవాదములు.