జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ . . .

భారతదేశంలోని డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి.

ఈ ఇంటర్వ్యూలు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించబడుతున్నాయి.

ఈ ఫెలోషిప్ ఖాళీలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఫెలోషిప్ కాల వ్యవధి ప్రాథమికంగా సంవత్సరం పాటు ఉంటుంది.

ఫెలోషిప్ నెలకు 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

ఎమ్మెస్సీ , బీటెక్ , ఎం టెక్ ఉన్నవారు మాత్రమే ఈ ఫెలోషిప్ అర్హులు.

వయస్సు 28 సంవత్సరాలు మించి ఉండకూడదు.

ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి,

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్  , రిసెప్షన్, సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆఫీస్,  ఐ.ఐ.ఆర్.ఎస్ క్యాంపస్ , 4 కాళిదాసు రోడ్డు ,  డెహ్రాడూన్ , ఉత్తరాఖండ్ 248001.

ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది వెబ్ సైట్ చూడగలరు.

www.iirs.gov.in

ధన్యవాదములు , తెలుగు ఫ్రెండ్.

Junior research fellow ships in IIRS.

error: Content is protected !!