ఈ శుక్రవారం కొత్త తెలుగు సినిమాలు . . .

ఈ శుక్రవారం రెండు విభిన్న కథాంశాలతో రెండు కొత్త సినిమాలు మనకోసం థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ‘ మణికర్ణిక ‘. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఈ రోజు విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క సాహస సన్నివేశాలు బాగా చిత్రీకరించారు

మణికర్ణిక కు కథ అందించిన వారు విజయేంద్ర ప్రసాద్. ఈయన మరెవరో కాదు బాహుబలి వంటి హిట్ సినిమా సినిమాలకు కథా రచయిత .

స్వాతంత్ర పోరాటంలో ‘ఝాన్సీ లక్ష్మీబాయి ‘ చాలా కీలకపాత్ర వహించింది

ఆమె జీవిత చరిత్ర కు సంబంధించినటువంటి అనేక సన్నివేశాలు కీలకంగా ఈ సినిమాలో పొందుపరిచినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది

మీకోసం zee studios వారి ‘ మణికర్ణిక’ తెలుగు అఫిషియల్ ట్రైలర్ వీక్షించండి.

మరొక సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ ముఖ్య తారాగణంగా నటించినటువంటి ‘ మజ్ను’ సినిమా థియేటర్లలో ఈరోజు విడుదలవుతుంది.

New Telugu movies Friday

ఈ సినిమాని ప్రేమ కథ కథాంశంగా తీసుకుని చేశారు .మజ్ను సినిమా ట్రైలర్ ను గమనిస్తే కొంచెం ఫ్రెష్ గా, నిర్మాణ విలువలతో తీసినట్టు అనిపిస్తుంది.

ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర క్రియేషన్స్ బి వి యస్ న్ ప్రసాద్ గారు నిర్మించారు .ఈ సినిమాకి సంగీతం ఎస్.ఎస్.తమన్ అందించారు.

మజ్ను సినిమా యూత్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా అఫిషియల్ ట్రైలర్ మీ కోసం .

ఈ సినిమాలు ఈ శుక్రవారం మన అందరిని అలరింప చేస్తాయని ఆశిద్దాం.

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!