Power of meditation

ధ్యానం చేస్తే లాభాలు ఎన్నో!

ధ్యానం అనేది ప్రస్తుతం ఉన్నట్టువంటి జీవన శైలి విధానం లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది . ఈ రోజు ధ్యానం చేయడం వల్ల కలిగే వెలకట్ట లేని లాభాలు తెలుసుకుందాము. 

ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితం లో నిత్యం ఎదుర్కొనే  ఆందోళన తో పాటు , శారీరక నొప్పులు తగ్గుతాయని , భావోద్వేగపరమైన తెలివితేటలూ పెరుగుతాయి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అయితే ధ్యాన ప్రక్రియలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ట్రాన్స్ డెంటల్ ధ్యానం .

  ఏదో ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ ధ్యానం చేయడం వల్ల ఈ రకమైన ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి.

  • దీనివల్ల విద్యార్థుల్లో ప్రతిభ పెరగడంతోపాటు,  హింసాత్మక ప్రవృత్తి తగ్గుతుందట.
  • ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి భావోద్వేగాలను అదుపులో ఉంటాయని తేలింది.

ఇందుకోసం వీళ్లు ఒత్తిడితో ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి, రెండు వర్గాలుగా విభజించి, ప్రతి రోజూ ఓ గంట పాటు వరుసగా నాలుగు నెలలు ఈ రకమైన ధ్యానం చేయించగా, చేయని వర్గం తో పోలిస్తే చేసిన వాళ్లలో ఒత్తిడి తగ్గడంతోపాటు , భావోద్వేగాలకు సంబంధించిన తెలివితేటలు పెరిగినట్టు గుర్తించారు.

కాబట్టి ప్రతి ఒక్కరు రోజులో కనీసం పది నిముషాలు అయినా ధ్యానం చేయడానికి కేటాయించి  ఆరోగ్యంగా , ఉత్సాహంగా ఉండాలి. 

error: Content is protected !!