సొరచేప పిడుపు ‘ అదుర్స్ ‘ . . .

సొరచేపపిడుపు కి కావలసిన పదార్ధాలు :

సొరచేప  – 500గ్రా  ,  నీళ్ళు – 250 మి.లీ , నూనె – 4 స్పూన్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్,  కారం  – ఒక స్పూన్,

పసుపు – చిటికెడు, ఉప్పు – సరిపడేంత, ఆవాలు  – చిటికెడు, కరివేపాకు – 12 ఆకులు ,  వెల్లుల్లి  – 12 రేఖలు,

ఎండుమిర్చి  – 4 , కొత్తిమీర- 3 రెమ్మలు ( చిన్నగా తరగాలి)

Shark curry preparation

సొరచేపపిడుపు తయారు చేసే విధానం:

  • ముందుగా సొరచేప ముక్కలుగా కోసుకుని వేడినీళ్ళలో ఉడకపెట్టుకోవాలి.
  • ఉడకబెట్టిన ముక్కలను మంచినీటిలో వేసి,  పైన ఉన్న పొర  తీసివేసి , లోపల ముల్లు కూడా తీసివేసి శుభ్రం  చేసుకోవాలి.
  • ఇలా శుభ్రం చేసిన సొర చేప ముక్కలను వేరే ఒక్క గిన్నెలో తీసుకుని,  ఆ ముక్కలలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్    కారం,పసుపు, గరంమసాలా,ఉప్పు వేసి అన్ని కలిసేలా  మెత్తగా చిదిమి ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కడాయి తీసుకుని కొంచెం నూనె వేసి బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు , కరివేపాకు  వేసి వేగనివ్వాలి.
  • తర్వాత వెల్లుల్లి రేఖలు వేసి లేత బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి.  తర్వాత ఎండుమిర్చి ని ముక్కలు చేసి, ఒక నిమిషం పాటు వేయించాలి . చివరగా మెత్తగా చిదిమి ప్రక్కన పెట్టుకున్న సొరచేప పిడిపిని ఈ  నూనెలో వేసి బాగా కలపాలి .
  • ఇప్పడు స్టవ్ మంట కొంచెం తగ్గించి  10 నిమిషాలు సొరచేప పిడిపిని నూనె లో  మెల్లగా కలుపుతూ ఉండాలి. సొరచేప  పిడిపిని  దగ్గర పడేంతవరకు వేయించుకుని, కొద్దిగా కొత్తిమీర వేస్తే సొరచేపపిడుపు కూర రెడీ.

ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని ఈ కూరతో భోజనం చేయండి.

error: Content is protected !!