‘ గుత్తి వంకాయ కూర ‘ . . . కమ్మగా . . .

ఈరోజు స్పెషల్ “గుత్తి వంకాయ కూర”. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది . ఒక్కసారి తింటే మళ్లి మీరే వండుతారు .

వంకాయ కూర రుచిగా వండడం ఇంత సులభమా అనుకుంటారు .

ఈ వంకాయలను కొన్నప్పుడు, మరి పెద్దవి కాకుండా మీడియం సైజు ఉన్న, పుచ్చులు లేని వంకాయలను తీసుకోవాలి.

గుత్తి వంకాయ కూర తయారీ కి కావలిసిన పదార్ధాలు :

 • వంకాయలు – 1/2 కేజి .
 • మసాలా తయారీకి :
 • ఎండు మిర్చి – 10 , వెల్లుల్లి రెబ్బలు – 12, నువ్వులు – 1/2 కప్పు , ధనియాలు – 2 చెంచాలు , జిల్లకర్ర – 2 చెంచాలు , ఎండు కొబ్బరి పొడి – 1/2 కప్పు .
 • పచ్చిమిర్చి – 6 , కరివేపాకు – 4 రెమ్మలు , ఉప్పు – తగినంత , నూనె – 4 చెంచాలు , కొత్తిమీర – కొద్దిగా.

How to cook brinjal curry.

ఈ కూర ఏ విధంగా తయారు చేయాలంటే,

 1. వంకాయలను శుభ్రంగా కడిగి పైనున్న కాడ ను అదే విధంగా ఉంచి , వంకాయలను మధ్యలో కి చీల్చి ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచాలి .
 2. మసాలా తయారీ విధానం : స్టవ్ వెలిగించి , ఒక పాన్ తీసుకుని అందులో ఎండు మిర్చి , వెల్లుల్లి రెబ్బలు , ధనియాలు , జిల్లకర్ర వేసి కొంచెం సేపు పొడిగానే వేయించాలి.
 3. తరువాత నువ్వులు కూడా వేసి వేయించి , చివరి లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి .
 4. తరువాత కాసేపు చల్లార్చి ఈ వేయించిన పదార్ధాలు లో రుచి కి సరిపడా ఉప్పు వేసి , మిక్సీ లో మెత్తగా ముద్దలా మసాలా ని రుబ్బుకోవాలి .
 5. ఇప్పుడు ఈ మసాలా ముద్ద ని చీల్చిన వంకాయలు మధ్యలో ఉంచి వంకాయలు సిద్ధం చేసుకోవాలి .
 6. స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకుని , అందులో నూనె వేసి కొంచెం వేడి అయిన తరువాత, వంకాయలు ని ఆ నూనె లో వేసి కాసేపు వేయించి, మూత పెట్టి ఉడకనివ్వాలి .
 7. వంకాయలు సగం ఉడికిన తరువాత , ఏమి అయిన మసాలా ముద్ద కనుక మిగిలి ఉన్నట్లు అయితే ఇప్పుడు ఆ మిగిలిన మసాలా ని వేసి వంకాయలు ని మగ్గనివ్వాలి . నీరు చేర్చకూడదు .
 8. మసాలా, వంకాయలు బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేస్తే , ఘుమ ఘుమ లాడే గుత్తి వంకాయ కూర గిన్నె లోకి తీసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి .

ఈ వంకాయ కూర వేడి వేడి అన్నం తో తింటే ‘ సూపర్ ‘.

మీరు వండుకుని రుచి చూడండి . ఆనందించండి .

ధన్యవాదములు

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!