Tips for dry hair

పట్టులాంటి జుట్టు సహజం గా . . .

పట్టులాంటి జుట్టు కోసం చాలామంది తపన పడుతూ ఉంటారు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ క్రింద చెప్పిన చిట్కాలు ని పాటించడం ద్వారా ఒత్తయిన జుట్టు ని మరియు  బిగుసుకుని గడ్డిలా ఉన్న జుట్టు ని మృదువుగా చెయ్యవచ్చు. వారికోసం… 

చిట్కాలు మీ కోసం :

  • పావు కప్పు బాదం నూనెలో గుడ్డు సొన వేసి , బాగా గిలకొట్టి తలకు బాగా పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ చేయాలి.ఇలా వారానికోసారి చేయడం వల్ల బాదంలోని సహజ నూనెలు, గుడ్డులోని ప్రొటీన్స్ దెబ్బతిన్న శిరోజాలు మృదువుగా మారుస్తాయి.
  • బాగా పండిన అరటి పండు లో రెండు టీ స్పూన్ల తేనె, ముప్పావు కప్పు కొబ్బరి నూనె వేసి బాగా కలిపి పేస్టులా చేసి దీన్ని జుట్టుకి పట్టించి ఇరవై నిమిషాలు ఆగి షాంపూ చేయాలి.
  • రెండు టీ స్పూన్ల చొప్పున నిమ్మరసం, తేనె తీసుకుని బాగా కలపాలి. అందులోనే ఒక కప్పు నీళ్లు కూడా పోసి బాగా కలిపి జుట్టుకి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • గోరువెచ్చని కొబ్బరి పాలు లేదా అలోవేరా గుజ్జు వంటివి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసినా కూడా మంచిది.

పై చిట్కాలను పాటించి మంచి ఆరోగ్యవంతమైన జుట్టు ని మీ సొంతం చేసుకోండి.

error: Content is protected !!