tips to sleep

హాయిగా నిద్రపోయేందుకు . . .

మారుతున్న జీవనశైలిలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య నిద్రలేమి.

ఈ పరిస్థితులు చేరుకోకుండా, కంటినిండా నిద్రపోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంతసేపు నిద్ర పోతున్నా మా అని లెక్కలు వేయడం కాకుండా ,రోజూ ఒకే సమయానికి పడుకుంటున్నా మా లేదా అన్నది  ముఖ్యం.

లేకపోతే నిద్రలేమి సమస్య తప్పక పోవచ్చు .అందుకే సమయం నిర్ణయించుకుని దాన్ని అనుసరించడం తప్పనిసరి.

నిద్రపోయేముందు ఆకలితో పడుకోవడం ,అలాగే అతిగా తినడం రెండూ మంచివి కావు.

సరిగ్గా తినకుండా పడుకుంటే అర్ధరాత్రి మెలకువ వస్తుంది.

అలాగని అతిగా  తింటే జీర్ణం కాక నిద్ర పట్టదు. అందుకే తేలికపాటి మితాహారం తీసుకోవాలి.

పగటిపూట కాసేపు పవర్ న్యాప్  మంచిదే కానీ అరగంటకు మించిన నిద్ర ,రాత్రిళ్లు నిద్ర లేమికి కారణం అవుతుంది.

పనిలో విరామం కోసం కాసేపు నడుము  వాల్చడం మంచిది అయితే అది మధ్యాహ్న భోజనానికి ముందు ఉండేటట్లు చూసుకోవాలి.

శరీరానికి కావలసిన పోషక ఆహారం,తగినంత వ్యాయామం ఉన్నప్పుడు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. చక్కగా నిద్రపడుతుంది .

 ఇంటి పనులు సంబంధం లేకుండా రోజు అరగంట పాటు వ్యాయామం చేయాలి.

దీని వల్ల చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. నిద్ర కూడా పడుతుంది.

error: Content is protected !!