సృష్టి లోని భూమి అనేది ఒక స్వర్గం. ఆ స్వర్గాన్ని చూడడానికి భూమి మీదకి వచ్చి ఏమి చూడకుండానే వెళ్ళిపోదామా.
ఈ స్వర్గాన్ని చూడడానికి అమ్మ కడుపు లో కొన్ని నెలలు పాటు చీకటి లో ప్రయాణం చేసి ఈ భూమి మీదకి వస్తాము.
” మన జీవిత ఆరంభ ప్రయాణమే అధ్బుత ప్రయాణం ”
ప్రయాణం అంటే మనుసుకి సంబంధించింది. మనసుకి ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలిగించేది. ఈ భూమి మీద మన కోసం అనేక అందాలు మనకోసం సృష్టించబడి ఉన్నాయి.
ఈ ప్రకృతి అందం ముందు ఏది అయిన సముద్రం లోని నీటి బిందువు అంత.
సముద్రం అంటే అలల సవ్వడి. మనతో మాట్లాడడానికి , మనల్ని తాకడానికి ప్రతి అల ఒక దాని వెనుక ఒకటి పోటీ పడి మరి మనల్ని పలకరించి స్వాగతం పలుకుతాయి.
సముద్రపు అలలు చూసినప్పుడు మన మనుసు కి కలిగే ఆనందం, ఆహ్లాదం అనంతం. మనల్ని చూసి సముద్రం మురిసిపోతుంది నన్ను పలకరించడానికి వచ్చారని.
సముద్రం చెప్పే పాఠం జీవితం లో మనకి ఎవరు చెప్పలెరేమో కష్టాన్ని అయిన , బాధ అయిన తనలో దాచుకుంటుంది . సముద్రం కూడా ఏడుస్తుంది కాని మనకి కనిపించనివద్దు. ఆనందం వచ్చినప్పుడు కేరింతలు కొడుతుంది.
కాని ఉవ్వెత్తున ఎగిసే ప్రతి సముద్రపు అల ఒకటి స్పష్టం గా చెప్పుతుంది అలుపెరుగని ప్రయత్నం చేయాలని .
ఆకాశం అంత విశాలమైనది , అందమైనది భూమి మీద మరొకటి ఉండదేమో . మన మనుస్సు కూడా ఆకాశం లాంటిదే.
ఆకాశం అందం గా నీలి రంగులో , తెల్లటి మేఘాలు తో ఉండి మన అందరికి పైన, ‘ నేను ఉన్నానుగా మీ కోసం’ అంటుంది .
రాత్రి అయితే నక్షత్రాలు తో మరింత అధ్బుతం గా ఉండి , ప్రతి నక్షత్రం మనతో ఏదో మాట్లాడాలని , కథలు చెప్పాలని , ఏవో ఊసులు చెప్పుకోవాలని మన కేసి చూస్తునట్టు ఉంటాయి.
మనం రోజు చూసే ఒక అందమైన దృశ్యం పగలు, రాత్రి .
మనకి ఎలా తెలుస్తుంది ఇది పగలు , రాత్రి అని. మళ్లీ మన కోసం ప్రతి రోజు అలసి పోకుండా ఒక కొత్త రోజు తో స్వాగతం పలుకుతుంది “సూర్యుడు”
మనం చెప్పక పోయినా ప్రతి రోజు తన వెలుగుతో బాష లేకుండా , మౌనం గా గుడ్ మార్నింగ్ చెపుతుంది . తన వెలుగు తో మనల్ని మేల్కొలిపి, మనలో ని చైతన్యం నింపి మనకి దారి ని చూపిస్తుంది.
సూర్య కిరణాలు ప్రకృతి లోని ప్రతి అందాన్ని మరింత అందం గా చూపిస్తుంది ” మన ఆనందం కోసం .
సూర్యుడు నేస్తం చంద్రుడు. స్నేహానికి చిరునామా ఈ సూర్య చంద్రులు.
ఏ కష్టం అయిన రెండు పంచుకుంటాయి. అది పగలు,రాత్రి అయినా ; పౌర్ణమి , అమావాస్య అయినా . కాని రెండు ఎప్పుడు కలిసి ఉండలేవు. కలిసి లేక పోయినా , ఒకరి కష్టం ఒకరు పంచుకోవడం నిజం గా అధ్బుతం కదా .
ఇంత కన్నా మంచి స్నేహితులు ని మనం చూడగలమా . మన అందరం కూడా సూర్యచంద్రులు లా ఉందామా.
మన అందరి మధ్య స్నేహం ” నిండు పౌర్ణమి వెన్నెల “ లా ఉండాలని.
మనకి ఒక మిత్రుడు ఉన్నాడు. కాని మనకి కనిపించడు. కాని మన ప్రతి బాధ లో , సంతోషం లో ఉంటాడు. మనం ఉన్నంత వరకు మన ప్రయాణం లో మన తోనే ఉంటాడు. ఆ మిత్రుడే ‘కాలం‘.
కాలానికి ఒక క్షణమే జీవం . కాని నీకోసం ప్రతి క్షణం జన్మిస్తుంది. ఇంత కన్నా నీ మీద ప్రేమ ఎవరు అయినా చూపగలరా నేస్తం .
మన జీవిత ప్రయాణం లో ప్రతి ప్రయాణం ఆనందం గా సాగాలని ఆశిస్తూ . . .
ధన్యవాదములు,
తెలుగు ఫ్రెండ్ .