యాదగిరిగుట్ట. . . శ్రీ లక్ష్మి నరసింహ స్వామి. . .

వివాహము జరిగిన తరువాత ప్రతి జంట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులు తీసుకొనడానికి యాదగిరిగుట్ట క్షేత్రం యాదగిరి గుట్ట వస్తారు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే, కోరిన కోరికలు తీరుస్తారని ఒక ప్రతీతి.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి వేకువజామున 4 గంటలకు సుప్రభాత సేవతో సేవలు ప్రారంభమయి, రాత్రి 9 గంటల 45 నిమిషముల వరకు స్వామివారికి అనేక సేవలు నిత్యం జరుగుతూ ఉంటాయి.

yadagirigutta ‘ sri lakshmi narasimha swamy ‘

యాదగిరిగుట్ట, రాయగిరి రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనూ, భువనగిరి బస్ స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

తెలంగాణ రాజధాని హైదరాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

స్వామి వారికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో 11 రోజులు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం వారిచే బ్రహ్మోత్సవాలు జరపబడతాయి.

సంవత్సరం మొత్తం అనేక ఉత్సవాలు స్వామివారికి నిత్యం జరుగుతూ ఉంటాయి.

భక్తుల కొరకు స్వామి వారి ప్రసాదం , పులిహోర , దద్దోజనం, లడ్డు అందుబాటులో ఉంటాయి

దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యాలు కూడా గుడి నందు కల్పించబడతాయి.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తూ. ..

ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా యాదగిరిగుట్ట వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

http://yadagiriguttasrilakshminarasimhaswamy.org/index.html

error: Content is protected !!