100 కోట్ల బడ్జెట్ … చారిత్రాత్మక చిత్రం … మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా విడుదల

100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన చారిత్రాత్మక చిత్రం , మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ మరక్కార్ – అరేబియా సముద్ర సింహం తెలుగు సినిమా ట్రైలర్ మన మెగాస్టార్ ‘చిరంజీవి’ గారి చేతులమీదుగా విడుదల చేశారు.

ఈ సినిమాలో ఇంకా అనేక మంది ప్రముఖ నటులు కీర్తి సురేష్, అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, బాబు రాజ్, మంజు వారియర్ మొదలైన వారు నటించారు.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.

చారిత్రాత్మక చిత్రం ‘మరక్కార్’ మార్చి 26న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

నా ప్రియ మిత్రుడు , మోహన్ లాల్, ప్రియదర్శన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.

సినిమాటోగ్రాఫర్ తిరు మరియు చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు – చిరంజీవి

error: Content is protected !!