సూర్య నమస్కారం తో . . . నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా , ఆనందం గా . . .

మనిషికి – ప్రకృతికి ,మనిషికి – మట్టికి, ముఖ్యంగా మనిషికి-సూర్యుడికి మధ్య ఉన్న సంబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని చెప్పే పండగ.

ప్రతి జీవికీ ప్రత్యక్ష దైవమైన సూర్యుడు  మకర ప్రవేశం.

కానీ నేడు మనం ప్రకృతితో మనకు ఉన్న బంధాలను పూర్తిగా లేకుండా చేసు కుంటున్నాము.

సూర్యుడు ముఖం చూడటం మానేసాం.  వంటకాలను మాత్రం వదిలిపెట్టకుండా తింటున్నాం. అందుకే పండుగ ప్రాశస్త్యాన్ని కోల్పోతున్నాయి.శరీరం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.

ప్రకృతితో బంధాలను తెంచుకోవడం మన ఉనికికే ముప్పు.

సూర్యుడు కనబడకుండా జబ్బులకు, వ్యాయామం లేక వ్యాధుల్లో కూర్చుంటున్నాము.

అందుకే ఒకప్పటికంటే సూర్యనమస్కారాల అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.

 మన ప్రపంచం మొత్తానికి సూర్యుడే శక్తి కేంద్రం .ఆయన నుంచి వెలువడే సూర్యరశ్మి లేకపోతే జీవము లేదు ప్రాణము లేదు.

రెండు మూడు రోజులు మన కంటికి సూర్యుడు కనబడకపోతే జీవితం నిరాసక్తంగా , మందకొడిగా ఉంటుంది .చైతన్య రహితంగా తయారవుతుంది .

నిద్ర , మెలకువ నియంత్రించి మన జీవన గడియారాన్ని నియంత్రించేది సూర్యుడి వెలుగు . అందుకే అనాదిగా మనిషి సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తాడు.

యోగులు అయినా సామాన్య ప్రజానీకం మైన సూర్యనమస్కారాల కు మొదటి నుంచి ఇస్తున్న ప్ప్రాధాన్యానికి ఇదే మూలం.

యోగ విధానాలను అభివృద్ధి పరిచే దశలో యోగులు, మనిషి జీవితానికి ప్రకృతితో ఉన్న సంబంధాన్ని స్థిర పరిచేందుకు గణనీయమైన కృషి చేశారు.

అందులో భాగంగా యోగా నమస్కారాలు యోగ సాధనలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి .మనకు అత్యంత దగ్గరయ్యాయి .

సూర్యనమస్కారాల్లో భాగంగా కొన్ని శతాబ్దాల పాటు యోగ సంప్రదాయాల్లో నలభై ఎనిమిది రకాల  శరీర స్థితులను పాటించారు.

కానీ ప్రస్తుతం 12 స్థితిలోనే అన్నిచోట్ల పాటిస్తున్నారు. శరీరానికే కాదు, మనోవికాసానికి భావోద్వేగాల నియంత్రణకు ఆత్మానందాన్ని సూర్యనమస్కారాలు ఉత్తమమైనది అని గుర్తించారు .

నానాటికి మన జీవితం ఉరుకులు పరుగులు మధ్య సాగుతోంది. శరీరానికి అసలు వ్యాయామం ఉండటం లేదు.మనసుకు ఒత్తిడి పెరిగింది.

ఇప్పుడు శరీరానికి శ్రమ అవసరం .మనసుకు వికాసం చాలా అవసరం.

అతి తక్కువ సమయంలో ఈ రెండింటిని సంపాదించుకునే ఉత్తమమైన మార్గం సూర్య నమస్కారాలు.

రోజు సూర్యోదయం సమయంలో పది నుంచి పదిహేను నిమిషాలు కేటాయిస్తే చాలు అద్భుతమైన  శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు.

అలాగే మన శరీరానికి కావాల్సిన విటమిన్ ” D” కూడా లభిస్తుంది .కాబట్టి రోజూ కొంతసేపు ఎండలో గడపటం చాలా ఉత్తమమైనది .

ప్రత్యేకత

 యోగాసనాలు అన్నింటిలోకి సూర్యనమస్కారాల కు చాలా ప్రత్యేకత ఉంది .

12 శరీర స్థితి లతో కూడిన ఇవి చాలా నెమ్మదిగా ,సున్నితమైన కదలికలతో క్రమంగా సాగిపోతాయి.

ఏదో ఒక భంగిమలో ఆగిపోకుండా మొదటి నుంచి చివరి వరకు,  ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి కొనసాగటం దీని ప్రత్యేకత.

శరీరాన్ని వెనక్కు ముందుకు కాకుండా పూర్తిగా ,ముఖ్యంగా వెన్నుపూస పూర్తిస్థాయిలో మృదువుగా వంగుతుంది.

మొదట్లో సూర్య నమస్కారాలు బహుశా నమస్కార మంత్ర రూపంలోనే ఉండి ఉండొచ్చు .

ఇప్పుడు కూడా భక్తులు నదీ తీరాల్లో మంత్రాలతో సూర్యుడికి నమస్కరించటం మనం చూస్తూనే ఉంటాం. తర్వాత శరీర సంగమం కోసం వాటికి శారీరక స్థితులు తోడై ఉండొచ్చు.

నిజానికి సూర్య నమస్కార మంత్రాలు 1008. వీటిలో 15  ప్రచారంలో ఉన్నాయి.

ఒక్కో మంత్రాన్ని పఠిస్తూ 12 శారీరక స్థితిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే మంత్రాలతో లేకుండా వ్యాయామంలో భాగంగా సూర్యనమస్కారం చేసే వారు లేకపోలేదు .

నమస్కారాలను ఎవరైనా చేయొచ్చు .

 లాభాలు అనేకం

క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ చురుకుదనంతో, స్ఫూర్తి మంతం అవుతాయి.

శరీరాకృతి అందంగా తయారవుతుంది.

అజీర్ణం,మలబద్ధకం వంటి సమస్యలు ,ఒత్తిడి , ఆందోళన, అస్థిరత్వం దూరమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతాయి.

శరీరంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది.

వెన్నుపూస, మెడ కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి.

ఛాతీ కడుపు భాగంలోని కండరాలు సాగుతాయి.  శరీరంపై పట్టు పెరిగి పడిపోవడం వంటి ఇబ్బందులు తగ్గుతాయి.

ఉచితంగా విటమిన్

సాధారణంగా విటమిన్ మన శరీరం తయారు చేసుకోలేదు. ఆహారం రూపంలో వాటిని బయటి నుంచే తీసుకోవాలి. కానీ ఒక్క విటమిన్-డి మాత్రం  శరీరంలో తయారవుతుంది.

ఆరోగ్య రక్షణలో విటమిన్-డి పాత్ర చాలా కీలకం .విటమిన్-డి ఎముకలు క్షీణించకుండా చూస్తూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలోనూ ఉపయోగపడుతుంది .

ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చేస్తుంది .

ఇన్సులిన్ నూ శరీరం గ్రహించేలా చేయటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్-డి కణ విభజనను నియంత్రిస్తుంటుంది .ఫలితంగా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుంది.

ముఖ్యంగా విటమిన్ డి లోపం మూలంగా పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ ,క్యాన్సర్ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి .

కాబట్టి ఈ విటమిన్ లభించాలంటే రోజు మొత్తంలో కొద్ది సమయం అయినా తప్పనిసరిగా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి.

అందుకే రోజూ ఉదయాన్నే కొద్దిసేపు సూర్య నమస్కార సాధన చేయటం మించినది లేదు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా , ఆనందం గా . . . సూర్య నమస్కారం తో . . .

error: Content is protected !!