‘అన్నవరం ‘ . . . ఆనందంగా

ఈరోజు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం గురించి తెలుసుకుందాం.

ఇండియా లో ఉన్న చాలా పురాతనమైన టు వంటి పుణ్యక్షేత్రాలులో  అన్నవరం దేవస్థానం ఒకటి.

ఈ అన్నవరం దేవస్థానానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు

Annavaram in east godavari district

ఈ అన్నవరం తూర్పుగోదావరి జిల్లా నందు ఉన్నది. 

విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్ నుండి  పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

కాకినాడ,  రాజమండ్రి నుంచి అనేక బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడానికి మార్గం చాలా సులభం.

అన్నవరం చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది . మన మనసుకి ఆహ్లాదాన్ని పంచుతుంది.

కొండ మీదకి వెళ్లడానికి  దేవస్థానం బస్సులు, ఆటో లు  ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి.

ప్రతిరోజు స్వామివారికి అనేక సేవలు, అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు పూజలు జరుగుతూ నిత్యం దేవస్థానం శోభాయమానంగా శోభిల్లుతూ ఉంటుంది.

వివాహం తర్వాత ప్రతి పెళ్లైన జంట వారి యొక్క జీవితం సాఫీగా సాగాలని,  వారి అనుకున్న కోరికలు నెరవేరాలని స్వామివారి కళ్యాణం చేయించడం కోసం దూర ప్రాంతాలు నుంచి వస్తారు.

అనేక జంటలు నిత్యం స్వామివారి కళ్యాణం చేయిస్తూ ఉంటారు వారి కలలు నెరవేరాలని.

అన్నవరం ప్రసాదం తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు నిత్యాన్నదానం జరుగుతుంది.

అన్నవరం దేవస్థానం నందు వసతి సౌకర్యం కూడా కలదు. దూరం నుంచి వచ్చేటటువంటి భక్తుల కోసం ఈ వసతి  కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని మనం మీ సేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ప్రతి భక్తుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకొని, వారి కోరికలను తీర్చమని స్వామి వారిని వేడుకుని, అన్నప్రసాదాలు స్వీకరించి ఆనందంగా వెళ్తారు .

అన్నవరం దర్శించుకోండి … ఆనందం గా …

ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అన్నవరం వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

http://annavaramdevasthanam.nic.in/a.htm

error: Content is protected !!