బొప్పాయి తో అందం . . .

బొప్పాయి కి అందానికి చాలా దగ్గర సంబంధం ఉంది . బొప్పాయి ముఖానికి అందాన్ని ఇస్తుంది.

కొన్ని ముక్కలను మెత్తగా చేసి, దానికి చెంచాడు తేనె కలపాలి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మెరుస్తుంది. 

రెండు చెంచాల బొప్పాయి గుజ్జు,చెంచా టమాటా గుజ్జు కలపాలి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ముఖంపై మచ్చలు తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

 అరటిపండు, బొప్పాయి ముక్కలను మెత్తగా గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి.

ఇది ఎండ వల్ల కమిలిన చర్మానికి చక్కటి పరిష్కారం.

నాలుగైదు బాదం గింజలను రాత్రంతా పాలలో నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా చేయాలి .

దీనికి చెంచా బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పూతలా రాయాలి.

కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.

చెంచా చొప్పున నారింజ రసం, బొప్పాయి గుజ్జు కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసి పావుగంట తర్వాత కడిగేయాలి .

ఇది మచ్చలను తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

 చెంచా బొప్పాయి గుజ్జు,రెండుచెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.

ఇది పొడి చర్మంఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది