క్రిస్మస్ . . .క్రీస్తు భాష ‘అరామిక్’ ని . . . రెండు వేల సంవత్సరాలుగా . . . బ్రతికిస్తున్న గ్రామం…

క్రీస్తు భాష ‘ అరామిక్ ని రెండు వేల సంవత్సరాలుగా బ్రతికిస్తున్న ఒక చిన్న గ్రామం ఏమిటో  ఆ విశేషాలు చూద్దాం .

‘అల్లోయ్ అ ప్లీచ్ ఫీతా హ్ ‘ – ఈ వాక్యానికి తాత్పర్యం ఆ దేవుడు నీతో ఉండు గాక అని అర్థం.

ఇది క్రీస్తు ప్రవచించినట్టు చెప్పే అరామిక్ భాష . ఈ భాషను ఎక్కువగా మాట్లాడే గ్రామం పేరు ‘మలౌలా ‘

ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే, సిరియా రాజధాని డమాస్కస్ కు ఈశాన్యం గా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సముద్ర మట్టానికి అయిదు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన కుగ్రామం “మలౌలా”

మలౌలా గ్రామస్తులకు అరామిక్ భాషని ఉగ్గుపాలతోనే నేర్పిస్తారు.

ముస్లిం దేశమైన సిరియాలో ఒకే చోట ఎక్కువ మంది క్రైస్తవులు ఉండే ఏకైక గ్రామం ఇదే !

ఈ గ్రామంలో కి క్రైస్తవం ఎలా వచ్చిందంటే , దీనికి సంబంధించి ఒక చిన్న ఆసక్తికరమైన కథ చరిత్రపుటల్లో …

మలౌలా అంటే ‘ ప్రవేశం’ అని అర్థం. ఈ పేరు రావడం వెనుక ఉన్న కథ. . . .

క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో తక్లా అనే అమ్మాయి టర్కీ లో ఉండేది.

క్రీస్తు ఆరాధకుడు అయిన సెయింట్ పాల్ బోధలకు ఆకర్షితురాలైన  పద్దెనిమిదేళ్ల తక్లా ఏసుప్రభువు పై  భక్తి పెంచుకొని కన్యగా మిగిలిపోవాలని అనుకుంది.

అది గిట్టని తక్లా తల్లిదండ్రులు ఆమెని చంపేయాలని అనుకున్నారట.

వారు పంపిన దుండగులు ఆమెను తరుముతూ రాగా అక్కడినుంచి అనేక మార్గాలలో తప్పించుకుని సిరియాలోని మలౌలా గ్రామ ప్రాంతానికి చేరు కుందట.

ఇక అక్కడినుండి ముందుకు వెళ్లడానికి కొండ అడ్డం వచ్చేసరికి  తక్లా శక్తి లేక కూలబడి ‘ఏసు’ను ప్రార్థించడంతో ఆ కొండ రెండుగా చీలిందని , అలా ఏర్పడిందే మలౌలా గ్రామం అని చెప్తారు.

అలా తక్లా ద్వారా ఆ ప్రాంతంలో క్రైస్తవం వ్యాపించింది.

అరామిక్ భాష విశిష్టత గురించిన  పుస్తకాలను, అక్కడి గిఫ్ట్ షాపుల్లో విక్రయిస్తారు.

ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది భాషా శాస్త్రజ్ఞులు ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు.

కొంతమంది మలౌలా గ్రామస్తుల నమ్మకం వారి మాటల్లో . . .

ఏసుక్రీస్తు పునర్జీవితుడయ్యాడు భూమి మీదకు వచ్చినప్పుడు మేము ఒక్కళ్ళమే ఆ ప్రభువు తో మాట్లాడగలం అని చెబుతూ ఉంటారు’ 

ఏదేమైనా మలౌలా ఈజ్ గ్రేట్. – ‘ విష్ యు హ్యాపీ క్రిస్మస్’

 

error: Content is protected !!