‘దర్బార్’ మూవీ రివ్యూ

‘దర్బార్’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో రజినీకాంత్ నిజంగానే  ఒక యువకుడిగా కనిపించారు.

సినిమా ప్రారంభంలోనే రజినీకాంత్ చేసిన ఫైటింగ్ మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. రజినీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయింది.

సినిమాలో రజినీకాంత్ పోషించిన పోలీస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది.

డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాన్ని కథాంశంగా తీసుకుని మురుగుదాస్ తనదైన స్క్రీన్ ప్లే తో వెండితెర మీద చూపించారు.

ఒక తండ్రి, కూతురు మధ్య ఉండే ప్రేమని సినిమాలో చాలా బాగా చూపించారు. కూతురు గా నివేదా థామస్ చక్కగా అభినయించారు.

ముంబైలోని యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్ ముఠా ని పట్టుకోవడానికి రజనీకాంత్ పోలీస్ కమిషనర్ గా ముంబైకి వస్తారు. అక్కడ నుంచి కథ మొదలవుతుంది.

ఈ డ్రగ్ ముఠా ను పట్టుకునే క్రమంలో గ్యాంగ్ స్టర్ కొడుకుని అరెస్టు చేస్తారు. అక్కడ నుంచి కథ మలుపు తీసుకుంటుంది.

రజినీకాంత్ , నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు బాగా చిత్రీకరించారు.

గ్యాంగ్ స్టర్ కొడుకుని అరెస్టు చేసిన తర్వాత, కొన్ని కారణాల వల్ల జైలు లో గ్యాంగ్ స్టర్ కొడుకు చంపేయబడతాడు.

ఈ గ్యాంగ్ స్టర్ కొడుకు ఏ విధంగా చంపేయబడతాడు సినిమాలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ చాలా లాజిక్ గా తీసారు .

గ్యాంగ్ స్టర్ గా సునీల్ శెట్టి కనిపించేది కాసేపే అయినా, ఆ పాత్రకు న్యాయం చేశారు. తన కొడుకు చనిపోయిన దానికి ప్రతీకారంగా రజనీకాంత్ ని చంపేయాలని అనుకుంటాడు.

కానీ రజినీకాంత్ కూతురు ఆ పరిస్థితుల్లో ఏ విధంగా చిక్కుకుంటుంది , ఆ తరువాత ఆస్పత్రిలో తండ్రి, కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలిస్తుంది. ఆ సీన్ సినిమాకి హైలెట్.

తరువాత ఒక తండ్రి పడే బాధ , రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ ని పట్టుకునే విధానం లాజిక్ గా ఉంటుంది.

క్లైమాక్స్ అన్ని కథలు లాగానే మామూలుగానే ఉంది. ఇంకా కొన్ని ట్విస్టులు ఉన్నాయి అవి సినిమాలో చూడాలి.

సినిమాలో రజినీకాంత్ నిజంగానే ‘ సూపర్ స్టార్’ అనిపించుకున్నారు. ఆయన స్టైల్, నడక సూపర్. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు పర్వాలేదు.

మొత్తానికి ‘దర్బార్’ రజినీకాంత్ సూపర్ స్టార్ సినిమా.

error: Content is protected !!