కళ్ళు అలసిపోతుంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. . . . . .

Published on October 4, 2019

 

ఆఫీసు లోనే కాదు ఇళ్ళలోనూ రోజురోజుకి కంప్యూటర్ వాడకం పెరుగుతోంది . దానితోపాటు ఇంటర్నెట్ సౌకర్యం వల్ల మొబైల్ ఫోన్ల వాడకం పెరుగుతుంది . ఇది లాభాలతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు తెస్తున్నాయి. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని వారికి కళ్ళు అలసిపోవడం,  పొడిబారడం, దురద , అలాగే తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలతో నివారించుకునే అవకాశం ఉంది.

రెప్పలు ఆడించడం: కనురెప్పలను  ఆడించి నప్పుడు కన్నీళ్ళతో కళ్ళు శుభ్రం అవుతాయి. ఇది కంటికి సహజ రక్షణ కల్పిస్తుంది. కానీ కంప్యూటర్లో ఫోన్లు వాడేటప్పుడు వాటిని తదేకంగా చూడటం వల్ల, ఈ సమయంలో మామూలు కన్నా రెండు మూడు రెట్లు తక్కువగా కనురెప్పలను  ఆర్పు తుంటారు.ఇది కళ్ళు పొడిబారడానికి దారి తీస్తుంది. కాబట్టి తరచుగా కనురెప్పలను కదిలిస్తూ ఉండడం చాలా మంచిది .

20/20/20:  చాలాసేపు కంప్యూటర్ల ముందు గడిపేవారు కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు చూడటం మంచిది. దీంతో కళ్లకు విశ్రాంతి కలుగుతుంది.

తగు కాంతిలో కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు తలమీద తక్కువగా కాంతి అందించే లైట్లు ఉండేలా చూసుకోవాలి. డెస్క్ లైట్లు వాడేవాళ్ళు కాంతి మన వైపు కాకుండా బల్ల మీద పడేలా చూసుకోవాలి . కిటికీలు, తలుపులు నుంచి వచ్చే కాంతి కంప్యూటర్ తెర మీద పడకుండా జాగ్రత్త పడాలి .

సరైన దూరంలో కళ్ళకు కంప్యూటర్ తెరను సరైన దూరంలో,ఎత్తులో ఉండేలా చూసుకోవాలి . మన కంటి స్థాయికన్నా కంప్యూటర్ తెర మధ్య భాగం 15-20  డిగ్రీల (4-5 అంగుళాలు) కిందకి ఉండాలి . అలాగే మన కంటికి కంప్యూటర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అంగుళాలు దూరం ఉండాలి.

error: Content is protected !!
Enjoyed this video?
eye care tips in telugu
"No Thanks. Please Close This Box!"