‘ఫోలిక్ యాసిడ్’ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి . . . ముఖ్యం గా మహిళలు కి

Published on January 21, 2019

ఫోలిక్ యాసిడ్

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైనది. “మహిళలకు ” ఇంకా ప్రత్యేకం.ఈ ఫోలిక్ యాసిడ్ పురుషులలో కంటే మహిళల కు అత్యవసరం, ఎందుకంటే మహిళలలో ప్రతి నెల నెలసరి రావడం , గర్భం దాల్చడం , బిడ్డకు జన్మనివ్వడం , పిల్లలకు పాలు ఇవ్వడం వంటి అనేక దశలలో ముఖ్య మయిన పాత్ర వహిస్తుంది .

ఫోలిక్ యాసిడ్ అనేది గర్భధారణ లో చాలా ప్రముఖ పాత్ర ని కలిగి ఉంటుంది.  మనిషి పుట్టినప్పటి నుండి ప్రతి దశలోనూ కణ నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి ఫోలిక్ యాసిడ్ అవసరం.

Folic acid importance for every one and women.

మహిళలు ఎవరైనా సరే గర్భం కలిగినప్పుడు తొలిరోజుల్లో శిశువు ఎదుగుదల లో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అంటే  శిశువుకు వెన్నెముక, నరాలు ఏర్పడే తొలి దశలో ఫోలేట్ లు అత్యవసరం.

అందుకే గర్భం ధరించాలని ఆలోచన కలిగినప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహార పదార్థాలను మహిళలు తీసుకోవలసి ఉంటుంది

మహిళలు గర్భం ధరించిన తరువాత ” తొలి 12 వారాలు “ ఫోలిక్ యాసిడ్ అత్యంత కీలక పాత్ర వహిస్తుంది .

 • ఈ 12 వారాలు ఫోలిక్ యాసిడ్ పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నెలలు నిండకుండానే ప్రసవం అవడానికి అవకాశం ఉంటుంది.
 • ఒకవేళ ప్రసవం జరిగిన ఆ బిడ్డ తక్కువ బరువు తో పుడతాడు.అందుకే ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటూ , క్రమం తప్పకుండా సరైన డాక్టర్ ని సంప్రదించ వలిసి ఉంటుంది .

మహిళలకు ‘సర్వైకల్ క్యాన్సర్ ‘ రాకుండా కాపాడుతుంది. ఎముకలు గుల్లబారకుండా , పెద్ద వారిలో గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 11 ఏళ్లు దాటిన అమ్మాయిలు పెళ్లి అయ్యేంత వరకు రోజు ఫోలిక్ యాసిడ్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.  

గర్భం ధరించడానికి సిద్ధంగా ఉన్న వారు 0.04 మిల్లీ గ్రాములు ,   గర్భం ధరించిన తొలి పన్నెండు వారాల్లో 0.05 మిల్లీ గ్రాములు , పాలిచ్చే సమయంలో 0.03 మిల్లీ గ్రాములు   మోతాదులో  ఫోలిక్ యాసిడ్ తీసుకోవలసి ఉంటుంది. మీకు అవగాహన కోసం మాత్రమే.

నిష్ణాతులు అయిన డాక్టర్ సూచించినట్లు మాత్రమే మనం ఫోలిక్ ఆసిడ్ ఉన్న మందులు కూడా వాడవలిసి ఉంటుంది .

 • ఫోలిక్ యాసిడ్ లోపం వలన ముఖము , పెదాలు పాలిపోవడం , త్వరగా అలసిపోవడం , కొంచెం నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి .
 • ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నట్లయితే 30 సంవత్సరాలు దాటిన తరువాత ఎముకలు బలహీనపడటం , గుండె బలహీనత మరియు జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పెద్ద వయస్సు ఉన్నవారికి మతిమరుపు , కంటి చూపు వంటివి తగ్గకుండా ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది.

గమనిక  :  తలసేమియా ఉన్నవారు ఈ ఫోలిక్ ఆసిడ్ పట్ల నిరంతరం జాగ్రత్త వహించవలిసి ఉంటుంది . వీరికి ప్రాణం తో సమానం ఫోలిక్ ఆసిడ్ .

మరి ఫోలిక్ ఆసిడ్ చేసే మేలు పొందాలంటే ఏమి చేయాలో చూద్దాం …

ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు :

 • ఆకుకూరలలో ఫోలేట్లు అత్యధికంగా ఉంటాయి.వీటిలో చెప్పుకోతగినది పాలకూర. తోటకూర , చుక్కకూర లో కూడా ఉంటాయి. కాని మరీ ఎక్కువ మంట మీద వండకుండా కేవలం కుక్కర్లో ఉడకబెట్టి తీసుకోవడం వలన  ఫోలిక్ యాసిడ్ అధికంగా లభించడానికి అవకాశం ఉంటుంది. 
 • బీన్స్ , చిక్కుడు గింజలు , పప్పు దాన్యాలు లో  ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది.
 • నిమ్మ జాతికి చెందినటువంటి పండ్లలో ఫోలిక్యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది.
 • నారింజ రసం తాగినట్లయితే అత్యధికంగా పోలిక్ యాసిడ్ అందుతుంది.
 • పొద్దుతిరుగుడు గింజలు వేయించుకుని తింటే ఫోలిక్ యాసిడ్ అధికంగా అందడానికి  అవకాశం ఉంటుంది.

ఈ క్రింది ఆహార పదార్థాలను తినడం ద్వారా కూడా మీరు ఫోలిక్ యాసిడ్ నుంచి కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.

 • బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి , పుట్టగొడుగులు, వేరుశనగ పప్పు, పచ్చిబఠానీ .
 • చేపలు, పాలు , అరటిపండు , మొక్కజొన్న , క్యాబేజీ.
 • బంగాళదుంపలు , చిలగడదుంపలు, గోధుమ పిండితో చేసిన పదార్థాలు లో కూడా ఉంటుంది .

మీరు అందరూ ఫోలిక్ ఆసిడ్ పట్ల అవగాహన కలిగి ఉంటారని , అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటూ . . .

మీకు నచ్చితే మీ స్నేహితులుకి , మీ బంధువులు కి షేర్ చేయండి .

ధన్యవాదములు .

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!
Enjoyed this video?
"No Thanks. Please Close This Box!"