అరటిపండు సహజసిద్ధమైన మాయుశ్చ రైజర్. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం కలది.
అరటి పండులో ఉండే విటమిన్ ఎ, బి 6, సి లలో చర్మాన్ని మెత్తబరచి , పొడిబారకుండా ఉంచే గుణం ఉంటుంది.
ఇవన్నీ కలిసి పాదాలను మృదువుగా మార్చేస్తాయు. మడమల పగుళ్లు కి ఇది తిరుగులేని మంత్రం.
బాగా పండిన రెండు అరటి పండ్లు తీసుకోండి. ఇప్పుడు పండిన ఆ అరటి పండ్ల గుజ్జును మెల్లగా పాదం అంతా రుద్దండి .
కాలివేళ్లు, వేళ్ళ సందుల కు కూడా గుజ్జుని చేర్చి చిన్న మసాజ్ లా చేయండి.
అలా రెండు పాదాలకు రాసి , 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
ఇరవై నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో అంటే చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయండి.
పడుకోబోయే ముందు ప్రతిరోజు చెయ్యాలి. అలా కనీసం రెండు వారాలు లేక మీ పాదాలను మృదువుగా అయ్యే వరకు చెయ్యండి.