కలిసి తింటే కలదు కెరీర్ . . .

కలిసి తింటే కలదు సుఖం అని తెలుసు కానీ కలిసి తినడానికి, కెరియర్లో ముందుకెళ్లడానికి ,సంబంధమేంటి? అంటే ఉంది అని చెబుతున్నాయి సర్వేలు.

అందుకే ఈ మధ్య గూగుల్ వంటి పెద్ద సంస్థలు కూడా పని ఉత్పత్తిని పెంచేందుకు తమ కాంటీన్ ల పైన  పెట్టుబడులు పెడుతున్నాయి.

ఉద్యోగులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ , తెచ్చుకున్న పదార్ధాలని పంచుకొని తింటుంటే ఆ ప్రభావం పని పై సానుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.

ఇది ఉద్యోగుల మధ్య సఖ్యత పెంచుతుంది. కలిసి భోజనం చేస్తే చక్కటి బృంద స్ఫూర్తినిప్రదర్శిస్తారని, పనులు తేలికగా చేస్తారని,అంతేకాకుండా పనిలో నాణ్యత ఉంటుందని తాజా సర్వేలు చెబుతున్నాయి.

ఒక బృందంగా తిని, ఒక జట్టుగా పని చేసేవాళ్ళు మెరుగైన ఫలితాలు అందిస్తున్నారని తాజా అధ్యయనాలు  చెబుతున్నాయి.

error: Content is protected !!