మనకు ఫ్రెండ్ ఉంటే మన బాగోగులు చూస్తుంది. మంచి చెడ్డలు కనిపెడుతుంది. కానీ అలాంటి స్నేహితులు అందరికీ దొరకడం కష్టమే కానీ మనకు మనమే మంచి ఫ్రెండ్ గా ఎందుకు ఉండకూడదు? మనకు మనమే ఎందుకు చక్కగా మార్గనిర్దేశం చేసుకోకూడదు!!
వ్యక్తిగత జీవితంలో కానీ, కెరీర్ కానీ వాస్తవంలో జీవించడం మొదలు పెట్టాలి. దీనినే నిపుణులు “బి ప్రెజెంట్” అంటున్నారు.
గతాన్ని వదిలిపెట్టి, ఇప్పటికీ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలనేది దీని అర్థం.
ఈ రకంగా వర్తమానంలో జీవించే వారికి వేరే స్నేహితుల మార్గనిర్దేశం అవసరం ఉండనే ఉండదు.
ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా మనసుపెట్టి చేయడం అనేది చాలా ముఖ్యం.
ఒక పనిలో పడి , ఇంకోటి ఇంకొకటి మరిచిపోతూ ఉంటే చేయాల్సిన పనులన్నీ ఒక జాబితా లాగా రాసుకోవాలి.దాన్ని వరుసగా చేస్తే సరిపోతుంది.
అయ్యో సమయమంతా వృధా చేస్తున్నాను అని పదేపదే అనుకోకండి. అంత తప్పు మరొకటి ఉండదు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, మనసుపెట్టి పని చేయడం నేర్చుకుంటే ఇలా అనుకోవాల్సిన పనిలేదు.
మన గురించి , మన ఆనందం గురించి వేరెవరో ఆలోచిస్తారు అనుకుంటే దానిని మించిన తప్పు మరొకటిలేదు.
వ్యాయామం చేయడం, పుస్తకం చదవడం, మంచి సినిమా చూడడం అలాంటివన్నీ ఆనందంగా ఉంచుతాయి.
ఇవన్నీ మనం, మన కోసం చేసుకునే పనులు.అలాగే తరచూ ఇతరులతో పోల్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మన ఆనందాన్ని హరించే విషయాల్లో ఇది ప్రధానమైంది.
మన బలాలు, ప్రత్యేకతలు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి.