అరుదైన ‘బ్రహ్మాలయం’ . . .

భారతదేశం మొత్తం మీద బ్రహ్మ ఆలయాలు మూడే ఉండేవట. లాహోర్ లో ఉండే బ్రహ్మ ఆలయం దేశ విభజన సమయంలో ధ్వంసము అయిపోయింది. ఇక రాజస్థాన్ లోని పుష్కర్ లోని ఆలయం, గోవాలోని ‘బ్రహ్మ కర్మాలి’ లోని ఆలయం మిగిలి ఉన్నాయి.ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. .

గోవా రాష్ట్ర రాజధాని పనాజి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బ్రహ్మ కర్మాలి’ ఓకుగ్రామం. గోవా – బిచోలం – సంఖాలి – వాల్ పోయి మార్గంలో వాల్ పోయి నుండి ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే వస్తుంది.

పురాణ కథ ఈ ఆలయం గురించి 

 • త్రిమూర్తుల్లో సత్వగుణాన్ని పరీక్షించదలచిన బృగు మహర్షి, సత్యలోకం వెళ్లి అక్కడ బ్రహ్మదేవుడు లక్ష్యం చెయ్యకపోవడం వల్ల కోపించి – ” నీకు భూలోకంలో పూజలు, ఆలయాలు ఉండవు’ అని ఆయన్ను శపించాడని ఓ పురాణ గాథ ఉంది.
 • పాతాళంలోకి, ఆకాశంలోకి అనంతంగా పెరిగిన జ్యోతిర్లింగం ఆదిని అంతాన్ని కనుక్కుందామని బ్రహ్మ విష్ణువులు బయలుదేరారని, శివలింగం అగ్రభాగం తాను చూశానని, బ్రహ్మ అబద్ధమాడితే – భూలోకంలో నీకు ఆలయాలు వుండవని శివుడు శాపం ఇచ్చాడని మరో కథ ఉంది.

పౌరాణిక కథలు ఎలా ఉన్నా బ్రహ్మదేవుడు పేరిట ఆలయం ఒక అరుదైన విషయం. 

 • బ్రహ్మ కర్మాలి ఊరి పేరు గురించి, బ్రహ్మలయ ఆవిర్భావం గురించి అనేక చారిత్రక కథలు వినిపిస్తాయి.
 • ప్రపంచం నలుమూలల నుంచి వలస పక్షులు వచ్చి చేరే ‘కర్మలెం తల్లెం ( కరం బోలిమ్ సరస్సు ). ఈ కరం బోలిమ్ సరస్సు, అది నెలకొనివున్న కరం బోలిమ్ గ్రామాల పేరు మీదే ‘ బ్రహ్మ కర్మాలి’ అన్న పేరు మీదే రూపుదిద్దుకుందని అంటారు.
 • గోవాలోని ప్రసిద్ధ ప్రొఫెసర్ డాక్టర్ నందకుమార్ కామత్ తన ‘ గోపక్క పట్నం త్రు ఏజెస్’ అనే వ్యాసంలో బ్రహ్మ కర్మాలి ఆవిర్భావం గురించి విలువయిన విశేషాలు వ్రాసారు.
 • ‘ కాదంబన హళ్లి ‘ అన్నదే కాలక్రమంలో ‘ కర్మాలి’ గా మారిందని ఆయన అంటారు. కన్నడ భాషలో హళ్లి అంటే పల్లె లేదా గ్రామం అని అర్ధం . కాదంబుల గ్రామమే కర్మాలి అయ్యిందని నంద కుమార్ కామత్ అభిప్రాయం.
 • కాదంబుల కాలంలో ఈ బ్రహ్మాలయం కాదంబన హళ్లి లో నెలకొని ఉండేదని,
 • 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి భయపడి కొందరు భక్తులు ఈ విగ్రహన్ని మరోచోటికి తరలించారని అంటారు.

అలా అనేక ప్రదేశాలు మారి  , ఈ విగ్రహానికి ఇక్కడ ఆలయం ఏర్పడిందని కామత్ కొన్ని ఆధారాలు చూపుతున్నారు .

బ్రహ్మ కర్మాలి ఆలయం సుందర ప్రకృతి నడుమ ప్రశాంత వాతావరణంలో భక్తి కలిగేలా ఉంటుంది.

 • ఆలయంలో బ్రహ్మ దేవుని విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో కనిపిస్తుంది. మూడు ముఖాలు ముందు వైపు నుంచి కనిపిస్తుండగా , నాలుగు ముఖాన్ని దర్శించేందుకు విగ్రహానికి వెనుక వైపు ఓ అద్దం అమర్చారు.
 • ఆభరణములుతో , చేతిలో కమండలం తో కనిపించే ఈ బ్రహ్మ రూపం పాదాలు వద్ద కొన్ని దైవ రూపాలు కనిపిస్తాయి. పాదపీఠం శివలింగాన్ని జ్ఞప్తికి తెస్తుంది .
 • గర్భాలయంలో కాదంబుల కాలంనాటి శిల్ప శైలి వైభవం కనిపిస్తుంది.

ఈ క్రింద వీడియో మీ కోసం Inside Goa channel వారి నుండి . . .

error: Content is protected !!