మన రాజమండ్రి నుండి వెంకటేశ్వర స్వామి సన్నిధానం అయినా తిరుపతికి విమాన సర్వీసులు 29 మార్చి 2020 నుండి ప్రారంభమవుతున్నాయి.
ఈ విమాన సర్వీసులను ఇండిగో వారు ప్రారంభిస్తున్నారు.
టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ రేటు Rs. 2,632 రూపాయలుగా నిర్ణయించారు.
విమాన సర్వీసులు రాజమండ్రి నుండి సాయంత్రం ఆరుగంటల 15 నిమిషాలకు బయలుదేరి రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు తిరుపతికి చేరుతుంది.
మళ్లీ తిరుగు ప్రయాణానికి తిరపతి లో సాయంత్రం నాలుగు గంటల 10 నిమిషాలకు బయలుదేరి మన రాజమండ్రి కి 5 గంటల 55 నిమిషాలకు చేరుతుంది.
ఈ విమాన సర్వీసులు రాజమండ్రి నుంచి తిరుపతికి, తిరుపతి నుండి రాజమండ్రి కి ప్రతిరోజు మార్చి 29 నుండి అందుబాటులో ఉంటాయి.