విదేశీ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం తీపి కబురు . . .

యూకేలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.

బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనలను విదేశీ విద్యార్థుల కోసం సవరించింది.

ఈ వీసా నిబంధనల ప్రకారం యూకేలోని డిగ్రీ, పీజీ చదువులు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కునే అవకాశాన్ని కల్పించింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

దీనివలన విదేశీ విద్యార్థులు రెండేళ్లపాటు పని చేయడంలో అనుభవం తెచ్చుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుంది అని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.

పూర్వం నిబంధనల ప్రకారం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉండేది.

ఇప్పుడు 24 నెలలు అంటే రెండు సంవత్సరాల కాలం మనం డిగ్రీ అయ్యాక ఉండొచ్చు.

దీనివలన భారతీయ విద్యార్థులకు మరియు మేధావులకు, నిపుణులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

ఈ సువర్ణ అవకాశాన్ని విదేశీ విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం సూచిస్తుంది.

error: Content is protected !!