పిల్లలు చేతి వ్రాత అందంగా ఉండాలంటే . . .

చదువు అనే నాణెంకి చదవటం, వ్రాయడం అనేవి బొమ్మ , బొరుసు లాంటివి అని చెప్పవచ్చు.  రెండూ ముఖ్యమే.

కొంతమంది పిల్లలు చదువులో చురుకుగా నే ఉంటారు. క్లాసులో టీచర్ చెప్పినది చక్కగా గ్రహిస్తారు. మౌఖిక పరీక్షలలో కూడా బాగానే మార్కులు తెచ్చుకుంటారు.

కానీ వ్రాయటం దగ్గరికి వచ్చేసరికి తత్తర పడతారు. వ్రాయటం అంటే నాకు ఇష్టం లేదు, బోర్ కొడుతుంది అని విసుక్కునే పిల్లలు కూడా ఉన్నారు.

పిల్లలు వ్రాయటం పట్ల ఉత్సాహం చూపక పోవడమే కాక అయిష్టత చూపటానికి , తప్పులు రాయటానికి అనేక కోణాలు ఉంటాయి.

అందులో మొదటిది చాలా చిన్న వయసులోనే – అంటే పిల్లలకు బలపం లేదా పెన్సిల్ ను సరిగ్గా పట్టుకోవటం రాని వయసులోనే వారితో వ్రాయించాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు.

 • కొన్ని పాఠశాలల్లో మూడు సంవత్సరాల వయస్సు నుంచి పిల్లలతో వ్రాయిస్తున్నారు. సరిగ్గా వ్రాయడం లేదని, తప్పులు రాస్తున్నారని దండించడం కూడా చేస్తూ ఉంటారు.
 • నిజానికి పిల్లలకు ఏ వస్తువునైనా గట్టిగా పట్టుకో గలిగే గ్రిప్ మూడు సంవత్సరాలు వయసు దాటిన తరువాత కానీ అలవడదు.
 • పెన్సిల్ పెన్ లేదా బలపం వగైరా లను గట్టిగా పట్టుకొని తాము అనుకున్న పద్ధతిలో కాగితం పైన పలక పైన వ్రాయగలిగే శక్తి నాలుగో వ సంవత్సరంలో కానీ అలవడదు.
 • అంతకుముందే తొందరపడి వారితో వ్రాయించాలని ప్రయత్నించటం, సరిగ్గా వ్రాయడం  లేదని దండించడం వంటి చర్యల వల్ల పిల్లలకు అసలు వ్రాయటం అంటే విరక్తి ఏర్పడే ప్రమాదం ఉంది.  ఆ కారణంగా నాలుగు సంవత్సరాలు దాటిన తరువాత కానీ పిల్లలతో వ్రాయించే ప్రయత్నం చేయ కూడదు.

ఇతర దేశాలలో

జర్మనీ, జపాన్ , స్విట్జర్లాండ్ వంటి కొన్ని దేశాల్లో పిల్లలకు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కానీవ్రాయించటం ప్రారంభించరు.

 • మన దేశంలో కూడా పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన తరువాత కానీ చదువు మాట తల పెట్టేవారు కాదు.
 • అయిదేళ్లు పూర్తయిన తరువాత అప్పుడు అక్షర అభ్యాసం చేసి బడిలో వేసేవారు. అప్పుడే ఓనమాలు దిద్దడం ప్రారంభమయ్యేది.
 • ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి . మూడేళ్లకే పిల్లలను బడిలో చేరుస్తున్నారు.
 • కొన్ని బడులలో పసి వారితో అప్పటి నుంచి వ్రాయించటం కూడా చేస్తున్నారు. ఆ కారణంగానే శరీరతత్వం రీత్యా ఇంకా పిల్లలు వేళ్లతో వస్తువులను గట్టిగా పట్టుకోవడానికి , తమకిష్టమైన పద్ధతిలో కదపడానికి సిద్ధపడని దశలోనే వ్రాయమని ఒత్తిడి చేయడంతో వారికి వ్రాత అంటేనే అయిష్టత ఏర్పడే ప్రమాదం ఉంది.
 • ఆ కారణంగా పిల్లలకు 4 వ సంవత్సరం పూర్తయి అయిదవ సంవత్సరం వచ్చే వరకు వ్రాయమని బలవంతం చెయ్యకుండా ఉండడమే మంచిది.

5 లేక ఆరో సంవత్సరంలో ప్రారంభించిన పిల్లలు , 9 లేక పది సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వ్రాయటంలో ఎంతో అభివృద్ధిని సాధించి, నిపుణతతో వ్రాయగలరని ఒక పరిశోధనలో తేలింది.

దృష్టి లోపాలు

 • కొంతమంది పిల్లలు టీచర్ బోర్డు మీద రాసింది చూసి వ్రాయటం లో తప్పులు చెయ్యటానికి, పుస్తకంలో చూస్తూ కూడా తప్పులు వ్రాయడానికి దృష్టి లోపాలు కారణం కావచ్చు.
 •  వ్రాయటంలో తప్పు దొర్లుతున్న, చదవడానికి తబ్బిబ్బు పడుతుండటం , చదివేటప్పుడు కళ్ళు చికిలించుకొని చూస్తూ ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని  సంప్రదించడం అవసరం.
 • దృష్టి లోపాలను అశ్రద్ధ చేసినట్లయితే అది ముదిరే  ప్రమాదం ఉంది అంతేకాక దృష్టి లోపాలను సరి చెయ్యకుండా పిల్లలను చదువుకోమని , వ్రాసుకోమని ఒత్తిడి చేసినట్లైతే వారు ఇబ్బంది పడతారు.
 • పిల్లల ఇబ్బందిని గమనించకుండా చదువుకోమని వారిపై ఒత్తిడి ని పెంచినట్లయితే , అటువంటి సందర్భాలలో పిల్లలకు చదువు అంటేనే విసుగు ఏర్పడే ప్రమాదం ఉంది .
 • లోగడ పలకలు ఉపయోగించే రోజుల్లో మొదట్లో పిల్లలు పలకలపై బలపాలు తో రాసేవారు. కానీ ఆ రోజులు మారిపోయాయి.  ప్రస్తుతము పిల్లలు నోటు పుస్తకాలలో పెన్సిల్ తో వ్రాయటం తోనే వ్రాయటానికి శ్రీకారం చుడుతున్నారు .
 • రకరకాల గ్రేడ్ లు కి చెందిన పెన్సిళ్ళు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి . వయస్సు ని బట్టి వారికి సరిపోయే పెన్సిళ్ళు కొని ఇవ్వడం మంచిది .

పెన్సిల్ తో వ్రాసినా పెన్ను తో రాసినా అక్షరాలు గుండ్రంగా కుదురుగా ఉండేటట్లు వ్రాయమని ప్రోత్సహించాలి కాపీ రాయటం, రోజుకి ఒక పేజీ లేదా రెండు పేజీలు చూసి వ్రాత వ్రాయటం వంటి ప్రక్రియల వల్ల కూడా దస్తూరి బాగుపడుతుంది

చాలా మంది తల్లితండ్రులు ఎంత సేపు చదువుకోమని ప్రోత్సహిస్తారు కానీ, వారి దస్తూరి విషయము గురించి అంతగా శ్రద్ధ వహించారు.

నిజానికి బాగా చదవడం ఎంత ముఖ్యమో తప్పులు లేకుండా , కుదురుగానిర్దిష్టంగా వ్రాయడం కూడా అంతే ముఖ్యం.

కాబట్టి తల్లిదండ్రులు, టీచర్లు కూడా పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ విషయంలో శ్రద్ధ వహించి వారు వ్రాయగలిగేటట్టు ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలు చదువులో మంచి ఫలితాలు సాధించగలరు. సాధన తో పిల్లలు చక్కగా వ్రాయగలరు .

error: Content is protected !!