ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన ఆహారం . . .

Published on August 30, 2019

ప్రతి మనిషి కష్టపడేది ఆహారం కోసం. కానీ ఆహారం తీసుకునే విషయంలో శ్రద్ధ వహించరు . అంతర్జాతీయ పోషకాహార నిపుణులు సూచించిన ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా మరియు ఆనందం ఉంటారు. ఆ ఆహార విశేషాలేమిటో చూద్దాం.

దీర్ఘ కాలం జీవించే జపాన్,సింగపూర్ వాసులు ని పరిశీలించిన అంతర్జాతీయ పోషక నిపుణులు అందుకు కారణమైన కొన్ని ఆహార విశేషాలు గురించి వివరిస్తున్నారు.

 సోయాబీన్స్: 

  •  సోయాబీన్స్ –  ఫైటో ఈస్ట్రోజెన్ రకానికి చెందిన ఐసో ఫ్లేవోన్స్ వీటిల్లో పుష్కలం. ఇవి క్యాన్సర్ని, సూక్ష్మజీవుల్ని, మంటను తగ్గిస్తాయి. దాంతో వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అవుతాయి.
  • వీటి వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.

క్యారెట్లు :

  • బీటా కెరోటిన్ అనే కెరోటినాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉండటంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఇదే శరీరంలో విటమిన్ ‘ఎ’ గా మారుతుంది. ఇది వయసుతో పాటు వచ్చే కంటి కండరాల క్షీణతను రాకుండా చేస్తుంది.

 క్యాబేజీ:

  •  బ్రకోలీ ,కాలిఫ్లవర్ , ముల్లంగి క్రుసి ఫెరా కుటుంబానికి చెందిన ఈ రకం కూరగాయల్లో పోషకాల శాతం ఎక్కువ. సి , ఇ,కె, విటమిన్లు, పొటాషియం, కాల్షియం , సెలీనియం ఖనిజాలు  వీటిల్లో పుష్కలం .
  • ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి . క్యాన్సర్ల ని నిరోధిస్తాయి .
  • వృద్ధాప్యంలో ఆలోచన శక్తి తగ్గకుండా చేస్తాయి . గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.  పీచు – కొవ్వును డైజెస్ట్ చేయడం తో   పాటు , మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. 
  • ఊబకాయాన్ని రానివ్వదు.

 సిట్రస్ పండ్లు:

  •  నిమ్మ , నారింజ,  కమల వంటి పండ్లలో విటమిన్ ‘సి’ కి ఇన్ఫెక్షన్లను అడ్డుకునే శక్తి ఉంది.
  • దీంతోపాటు వీటిలో అనేక రకాల చక్కెరలు,  పీచు, పొటాషియం, ఫోలేటు, క్యాల్షియం, విటమిన్ బి 6, ఫాస్ఫరస్,  మెగ్నీషియం,  కాపర్,  జింక్ వంటి పోషకాలు , ఇతర కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.

కాబట్టి ఇవన్నీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

error: Content is protected !!
Enjoyed this video?
Food for healthy life
"No Thanks. Please Close This Box!"