బ్యాంక్ చార్జీలు పడకుండా కొన్ని చిట్కాలు . . .

బ్యాంకులు అదనంగా వేసే చార్జీల నుండి తప్పించుకోవాలంటే మనం అందరం ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటే మనం సులువుగా బ్యాంకు అదనపు చార్జీల నుంచి విముక్తి పొందవచ్చు.

ఈ క్రింది పొందుపరచిన విధంగా మీరు అనుసరించినట్లయితే ఇది చాలా సులువు. మీకోసం కొన్ని సలహాలు సూచనలు . . .

How to avoid Bank charges

బ్యాంక్ లావాదేవీలు జరిపే ఏటీఎం కార్డు ని నెలకి ఐదు సార్లు మాత్రమే ఏ బ్యాంకు ద్వారా అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకు సంబంధించిన ఏటీఎం లు మాత్రమే వాడవలెను .

మీకు నెలకి అవసరమైన మొత్తం డబ్బుని నెలలో మూడు సార్లు అంటే ప్రతి పది రోజులకు ఒకసారి మీయొక్క అవసరాన్ని బట్టి ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకోవాలి మిగిలిన రెండుసార్లు మీకు అత్యవసరమైన పరిస్థితులలో వాడాలి .

మన బ్యాంక్ అకౌంట్ లో ఎంత కనీస మొత్తము ఉండవలెనో బ్యాంక్ నందు సంప్రదించి తెలుసుకోవాలి .

ఒక ముఖ్యమైన విషయం బ్యాంకులు ప్రతి వినియోగదారునికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాయి. మనం ప్రతి విషయాన్నిమనకి అకౌంట్ ఉన్న బ్యాంకు నందు అడిగి తెలుసుకోవాలి .

ప్రతి నెల మన బ్యాంకు ఎకౌంటు నందు జరిగే లావాదేవీలను మనం ఒకసారి సరి చూసుకోవాలి దేనికి చార్జీలు పడుతున్నాయి. ఎందుకు బ్యాంకు వాళ్లు దీనికి చార్జీ చేసారు అన్నది విశ్లేషించుకోవాలి.

మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి లెక్క చూసుకోవాల్సిన బాధ్యత మీదే.

ఈరోజు మీరు అదనపు చార్జీల భారం నుండి విముక్తి పొంది ఆ చార్జీల మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

ఈరోజు నుండి పైనున్న సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీయొక్క కష్టాన్ని కోల్పోకుండా ఉంటారని ఆశిస్తున్నాము.

మీ బ్యాంకుకు వెళ్లి మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోండి. మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోండి

” ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం . . .”

error: Content is protected !!