అలర్జీకి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఈ సమస్య వచ్చిందని గుర్తించగలిగితే, ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి.
కొన్నిసార్లు సౌందర్య ఉత్పత్తుల వినియోగం, జుట్టుకు వేసే రంగులు తగ్గించాలి.
రోజు పది గ్లాసుల మంచినీరు తాగాలి.
గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకోవాలి.
టమోటో, క్యారెట్, కీరదోస, నిమ్మరసం వీటిలో ఏదో ఒకటి తాగితే మంచిది.
కారం, మసాల , తేలికగా జీర్ణం కాని ఆహారాన్ని తగ్గించుకోవాలి.
చేదుగా ఉండే మెంతులు, కాకరకాయ, చిక్కు డు వంటివి ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
నువ్వులు, ఆవాలు రెండు సమభాగాలుగా తీసుకుని విడివిడిగా వేయించి పొడి చేసి కలపాలి . ఈ మిశ్రమాన్ని చెంచా చొప్పున సాయంత్రం తీసుకోవాలి.
లేత వేప ఆకులు, తులసి ఆకులు సమానంగా తీసుకొని శుభ్రంగా కడగాలి. వీటికి నీటిని చేర్చి నూరి రసం తీసుకోవాలి.
ప్రతిరోజు 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ రసం తాగితే చర్మంపై వచ్చే ఎలర్జీ తగ్గుముఖం పడుతుంది.
రెండు చెంచాల సుగంది పాల చూర్ణానికి గ్లాసు నీటిని కలిపి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడపోసి తాగాలి.
నెల నుంచి రెండు నెలలపాటు ఎలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
పసుపు కొమ్మును అరగదీసి ఆ గంధాన్నిపూ తగా వేసుకున్న మంచిదే.
వేప నూనెను నిత్యం రాస్తూ ఉంటే ఫలితం ఉంటుంది
ప్రతిరోజు నువ్వులు లేదా ఆవనూనెను ఒంటికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేయాలి అలెర్జీలు దరిచేరకుండా అదుపులో ఉంటాయి
లేత వేపాకులను నువ్వుల నూనె తో కలిపి సమస్య ఉన్నచోట రాస్తే ఫలితం ఉంటుంది.