ఆధార్ కార్డ్ – ఎందుకు అవసరం, నమోదు మరియు మార్పులు ఎలా చేసుకోవాలి

Published on August 23, 2019

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. భారత ప్రభుత్వం అందించే అనేక సదుపాయాలు పొందడానికి ఆధార్ కార్డు ని  ప్రతి ఒక్కరు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆధార్ కార్డ్ ని సులువుగా ఎలా పొందాలి , అవసరం  ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం 

ఆధార్ కార్డ్ వల్ల కలిగే ఉపయోగాలు :

 • రేషన్ కార్డ్ కి 
 • డ్రైవింగ్ లైసెన్స్ కోసం 
 • బ్యాంకు ఖాతా తెరవడానికి
 • పాన్ కార్డు దరఖాస్తు కి 
 • మొబైల్ కనెక్షన్ పొందడానికి
 • పాస్ పోర్ట్ కి 
 • ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం కి ( ఆరోగ్య శ్రీ  . . .)
 • స్థలాలు , ఇళ్ళు కొనుగోళ్ళు మరియు అమ్మకానికి 
 • బస్సు ,  రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి గుర్తింపు కార్డుగా. 
 • ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్ గా ఈ ఒక్క ఆదార్ కార్డు ఉంటే సరిపోతుంది.
 • e – KYC గా ఆధార్ కార్డ్  ని ముఖ్యం గా పరిగణిస్తారు .

ఆధార్ కార్డ్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

ఆధార్ కార్డ్ దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అవి ఏమిటంటే.

 • పేరు : మీ పేరు ఇంగ్లీషులో తప్పులు లేకుండా సరి చూసుకోవాలి . ( మీ    పదవతరగతి సర్టిఫికెట్ ప్రకారం )
 • పుట్టిన తేది : మీరు ఎప్పుడు పుట్టారో తేది , నెల , సంవత్సరం  కరెక్ట్ గా వ్రాయాలి .
 • చిరునామా :  మీరు ఎక్కడ నివసిస్తున్నారో  మరియు మీరు జతపరిచే అడ్రస్ ప్రూఫ్  డాక్యుమెంట్ లోని  చిరునామా మాత్రమే వ్రాయవలెను.
 • మొబైల్ నెంబర్ : ఇది చాలా ముఖ్యం . మీరు వ్రాసే మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ ని ఆన్ లైన్ లో  పొందవచ్చు మరియు మీరు ఇల్లు మారిన మీ చిరునామా ని ఆన్ లైన్ లోనే మార్చుకోవచ్చు . మీరు వాడే,  పని చేసే మొబైల్ నెంబర్ మాత్రమే వేయండి.

ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆధార్ కార్డ్ అప్లికేషన్  డౌన్ లోడ్  చేసుకుని , మీ దగ్గర లో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లో ప్రింట్ అవుట్ తీసుకోండి .

Aadhar card application form

లేదా మీకు దగ్గర లో ఉన్న ఆదార్ నమోదు కేంద్రాలు లో కూడా ఈ అప్లికేషను ఇస్తారు .

ఈ అప్లికేషను తో పాటు మీరు చిరునామ మరియు గుర్తింపు కార్డు జెరాక్స్  జత చేయాలి . మీ దగ్గర ఉన్న ప్రభుత్వం వారిచే జారిచేయబడిన ఏ డాక్యుమెంట్ అయిన జెరాక్స్ తీసి జత చేయవచ్చు .

పైన ఇచ్చిన ఆధార్ కార్డ్ అప్లికేషన్ లింకునందు అప్లికేషన్ ఫామ్ మరియు జత చేయవలసిన డాక్యుమెంట్స్ లిస్టు ఉన్నది.

ఆధార్ కార్డ్ లో  మార్పులు , చేర్పులు  ఎలా చేసుకోవాలి 

 • చిరునామా అయితే ఆన్ లైన్ లోనే మార్చు కోవచ్చు . ఈ క్రింద ఇచ్చిన  లింక్ ద్వారా మీరు మార్చుకోవచ్చు .

ఆధార్ కార్డ్ చిరునామా మార్పు ఆన్ లైన్ లో 

 •    ఆన్ లైన్ లో మార్చుకోవాలంటే మీరు తప్పని సరిగా  కొత్త అడ్రస్ ప్రూఫ్ స్కాన్ డాక్యుమెంట్ కలిగి ఉండాలి .
 • మీకు అవగాహన ఉంటే ఆన్ లైన్ లో వివరాలు ఇచ్చి , కొత్త అడ్రస్ ప్రూఫ్ స్కాన్ డాక్యుమెంట్ ని అప్ లోడ్ చేయాలి . మీ మొబైల్ నెంబర్ కి  ఒక కోడ్ వస్తుంది . ఆ కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు చెయ్యవచ్చు .
 • లేదా  మీకు దగ్గర లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాలు లో కూడా కొత్త అడ్రస్ తో ఉన్న డాక్యుమెంట్ జెరాక్స్ ని తీసుకుని వెళ్లి  దరఖాస్తు చేసు కోవచ్చు .
 • పేరు , పుట్టిన తేది , మొబైల్ నెంబర్  మార్చాలంటే తప్పని సరిగా మీరు ఆధార్ కేంద్రానికి  వెళ్లి మాత్రమే దరఖాస్తు చెయ్యాలి .

ఆధార్ నమోదు కేంద్రాలు :

భారత ప్రభుత్వం వారు ఆదార్ నమోదు కేంద్రాలు గా  కొన్ని బ్యాంకులు లో సెంటర్ లు ఏర్పాటు చేసారు . బ్యాంకులు ,  మీ సేవ కేంద్రాలు  , ఆధార్ కేంద్రాలు .

ఆధార్ కార్డు దరఖాస్తు  చేసిన తరువాత వచ్చిందా లేదా తెలుసు కోవడానికి  ఈ క్రింద ఇచ్చిన  లింక్ ద్వారా తెలుసుకోవచ్చు . మీకు దరఖాస్తు చేసినపుడు  ఇచ్చిన రసీదు లోని ఎన్ రోల్ మెంట్  ఐడి  ఎంటర్ చేసి తెలుసు కోవచ్చు .

ఆధార్ కార్డు  స్టేటస్ తెలుసుకోవడానికి 

 • మీరు ఆధార్ కార్డు ఆన్ లైన్ లో పొందడానికి ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు . 

ఆధార్ కార్డు డౌన్ లోడ్  చేసుకోవడానికి 

 • మీరు  ఎన్ రోల్ మెంట్  ఐడి లేదా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.   మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీ ఆధార్ కార్డు మీ చేతుల్లో  . . .

మీకు ఆధార్ కార్డు కి  సంబంధించిన అన్ని విషయాలు మీకు ఉపయోగ పడతాయని ఆశిస్తూ . . .

మీ తెలుగు ఫ్రెండ్  

 

error: Content is protected !!
Enjoyed this video?
how to get aadhar card
"No Thanks. Please Close This Box!"