బద్ధకం వదిలి ఉల్లాసంగా . . .

 పొద్దున్నే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు.

కాఫీలో ఉండే కెఫిన్ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.

అలాగని ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగితే శరీరంలోని ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది .దాంతో ఒత్తిడి కూడా పెరుగుతుంది.

బిజీగా ఉన్న చాలామంది అలసటగా ఉన్నామని తరచూ ఫిర్యాదులు చేస్తుంటారు. దానికి కారణం కెఫిన్.

రాత్రి పూట కాఫీ, టీ లను వీలయినంతవరకు తాగకుండా ఉండటం చాలా మంచిది. దీనివల్ల కెఫిన్ ప్రభావం తగ్గుతుంది. బదులుగా హెర్బల్ టీలు తాగడం మంచిది.

 కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తరచుగా తీసుకోవాలి .

అరటిపళ్ళు, దంపుడు బియ్యం, ఇతర పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

వీటిలోని పోషకాలు సెరిటోనిన్ విడుదల చేసి విడుదల చేస్తాయి. ఇది హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.

దాంతో బద్ధకం లేకుండా ఉత్సాహంగా లేచే అవకాశం ఉంటుంది.

పొద్దున్నే గ్లాసు మంచినీళ్ళు తాగితే శరీరానికి శక్తి వస్తుంది. ఏకాగ్రతగా పని చేసే అవకాశం ఉంటుంది.

 నీళ్ళు శరీరంలోని వ్యర్థాలను నియంత్రించి, ప్రాణవాయువు సరిగా అందేలా చేస్తాయి.

కాబట్టి ఉదయాన్నే గ్లాస్ మంచినీళ్ళు తాగడం ఓ అలవాటుగా మార్చుకోండి.

వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవడం ఎంతైనా అవసరం.

పొద్దున్నే కాసేపు నడక ,పరుగు మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.

error: Content is protected !!