లిప్ బామ్ చేసేద్దాం . . .

పెదాలు అందంగా ఉండేందుకు లిప్ గ్లాస్ వాడుతూ ఉంటారు.అయితే మార్కెట్లో దొరికేవి  కాకుండా సహజసిద్ధంగా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.  చాలా సులువుగా ఈ క్రింది  మూడు  పద్దతులు లో  తయారు చేసుకోవచ్చు . ఎలాగో ఇప్పుడు చూద్దాం .

  1. 10  స్ట్రాబెర్రీ పండ్లు,చెంచా బాదం నూనె , చెంచా తేనె,  ఒక గిన్నెలోకి తీసుకుని మైక్రోఓవెన్ లో కొద్ది నిమిషాలు వేడి  చేయండి.

          బయటికి తీసిన పండ్లను బాగా చిదిమి రసాన్ని పిండి, తొక్క తీసేయాలి.

         దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసుకుని వాడుకోవచ్చు.

 2. చెంచా కలబంద గుజ్జు, చెంచా పెట్రోలియం జెల్లి, ఒకటిన్నర చెంచా కొబ్బరి నూనె కలిపి ఓ గిన్నెలోకి తీసుకుని కొద్దిసేపు వేడిచేయాలి.

రెండు గంటలపాటు చల్లార్చి సీసాలోకి తీసుకుని వాడుకోవచ్చు.

3.  పావుకప్పు మైనాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మైక్రోఓవెన్ లో వేసి వేడి చేయాలి.

దీనికి పావుకప్పు ఆవదం ,పావుకప్పు నువ్వుల నూనె, కొద్దిగా బీట్ రూట్ రసం కలపాలి.

మైనం కరిగిన తర్వాత దింపి చిన్న బాటిల్ లోకి తీసుకోవాలి. 

అప్పుడప్పుడు పెదాలకి రాసుకోవచ్చు.

error: Content is protected !!