ఈరోజు మీ అందరి కోసం ప్రత్యేకమైనటువంటి మద్రాస్ రసం. దీన్ని మనం అన్నంతోపాటు తీసుకోవచ్చు లేదా మామూలుగా త్రాగిన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ప్రయత్నించి చూడండి. బాగుంటుంది.
ఈ ‘మద్రాస్ రసం’ ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూద్దాం. సిద్ధంగా ఉన్నారా!
How to prepare madras rasam
ఏ వంట కైనా మనం ముందుగా పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. ఆ పదార్థాలు ఏంటి అన్నది చూద్దాం.
- ధనియాలు – 2 టీ స్పూన్లు
- అల్లం – చిన్న ముక్క
- వెల్లుల్లి రెబ్బలు – 3
- నూనె – 2 టీ స్పూన్లు
- ఎండుమిర్చి – 2
- పోపు దినుసులు – 1 టీ స్పూన్
- కరివేపాకు – రెండు రెమ్మలు
- ఉప్పు – తగినంత
- నీళ్ళు – 1 గ్లాస్ న్నర
- పసుపు – చిటికెడు ,
- టమాటాలు – రెండు (వీటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ) ,
- పచ్చిమిర్చి – 2
- కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లో ధనియాలు ,అల్లం , వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా నీళ్లు వేసి ఒక ముద్దలా తయారు తయారు చేసుకొని ప్రక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక పాన్ లేదా కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి వేడి చెయ్యాలి.
- కొద్దిగా నూనె వేడి అయిన తరువాత ఎండు మిర్చి ని చిన్న ముక్కలు గా చేసి వెయ్యాలి . వీటి తో పాటు పోపు దినుసులు , కరివేపాకు , కొద్దిగా దనియాలు వేసి వేయించి, ఒక గ్లాస్ న్నర నీళ్ళు వేసి మరిగించాలి .
- ఇలా మరుగుతున్నపుడు కొద్దిగా పసుపు వేసి, తరిగిన టమోటా ముక్కలు ని కూడా వేసి , రుచి కి సరిపడ్డ ఉప్పు వేసి బాగా కలపాలి . రెండు నిమిషాల తరువాత మనం పైన తయారు చేసుకున్న ధనియల ముద్ద ని కలిపి కొంచెం సేపు మరిగించాలి .
- ఇప్పుడు రసం కొంచెం దగ్గరకు వచ్చేవరకు ఉండి , చీలిన పచ్చి మిర్చి , కొత్తిమీర వేయాలి. ఒక నిమిషం తరువాత మన కోసం ప్రత్యేకమైన , ఎంతో రుచి కరమైన “ మద్రాస్ రసం “ సిద్ధం .
- ఈ రసాన్ని వేడి వేడి అన్నం తో తీసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే సూప్ లా త్రాగవచ్చు .
గమనిక : టమోటా బదులు మీకు ఇష్టం అయితే చింతపండు కూడా వాడవచ్చు .