అన్నం ‘రుచి’ గా . . .

‘ అన్నం ‘ – ఎంతో కష్టపడి రైతు మన అందరి కోసం పండించే పంట.

మన అందరం కష్టపడేది ఆ ‘అన్నం’ కోసమే.

ఒక పురాతన సామెత – ” కోటి విద్యలు కూటి కొరకే “ .

How to cook Rice (Annam)

అన్న ప్రసన రోజు ప్రతి బిడ్డ అమ్మ చేతితో ప్రేమతో  తినే తొలి ముద్ద ” అన్నం “.

అన్నిటి కన్నా “అన్న దానం” మిన్న . దయ చేసి అన్నం వృధా చేయకండి .

మితం గా తిందాం , ఆరోగ్యం గా ఉందాం .

ఆకలి తో ఉన్న వారికీ అన్నం పెడదాం . ఆనందంగా ఉందాం.

అన్నం తయారు చేయడానికి  కావలిసిన పదార్ధాలు :

బియ్యం – 1 గ్లాసు

నీళ్ళు    –   2 గ్లాసులు

చిటికెడు  – ఉప్పు

చిటికెడు –  నూనె

అన్నం తయారు చేసే విధానం :

ముందుగా గిన్నె లో బియ్యం తీసుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నీరు పూర్తిగా తిసేవేసి బియ్యాన్ని ఒక గిన్నెలో గాని, కుక్కర్ లో గాని వేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసి, చిటికెడు ఉప్పు , నూనె కూడా కలిపి మూత పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టు కోవాలి.

కుక్కరు  అయితే 3 ఈలలు వచ్చే వరకు ఉండి స్టవ్ ఆఫ్  చేసుకోవాలి.

అన్నం గిన్నెలోవండినట్లు అయితే నీరు ఇగిరే వరకు ఉంచాలి . ఒక పది నిముషాలు తరువాత మూత తీసివేసి  అన్నం వేడి వేడి గా మీ

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందం గా భోజనం చేయండి.

కొన్ని చిట్కాలు మీ కోసం   : 

  • నూనె , ఉప్పు వేయడం వలన అన్నం బాగా రుచిగా ఉండి, పొడి పొడి గా వస్తుంది .
  • బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బొరిక్ ఆసిడ్ బియ్యం డబ్బాలో ఉంచితే పురుగు పట్టదు. బొరిక్ ఆసిడ్ మెడికల్ షాప్ లులో చిన్న బాక్స్ రూపం లో అమ్ముతారు .
  • బియ్యం నాణ్యత తెలియాలంటే బియ్యాన్ని నీటిలో కడిగినప్పుడు నీరు చిక్కగా అవ్వకూడదు. బియ్యం నీటిలో పలుచగా అంటే సెలయేటి లో నీరు లా కనిపించాలి .
error: Content is protected !!