ఆరోగ్యం సొంతం కావడానికి, ఆనందంగా ఉండటానికి ఎన్నో మార్పులు చేసుకుంటాం. మరి ఉద్యోగాల్లో రాణించాలంటే? నిజమే.
ఈ రోజుల్లో కేవలం అర్హత ఒక్కటే సరిపోవు, నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి .
నలుగురితో తరచూ మాట్లాడుతుండటం, చక్కటి స్నేహబంధం,నెట్వర్క్ కలిగి ఉండడం కేవలం ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికే కాదు,అందరికీ అవసరమే.
దానివల్ల మార్కెట్లో మీరు ఎంచుకున్న రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు తెలుస్తాయి.
కొత్త అవకాశాల పై అవగాహన ఏర్పడుతుంది.
అవతలి వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
అందుకు మీరు చేయాల్సిందల్లా మీకు ఉన్న స్నేహితుల తో మాట్లాడాలి .
అవకాశం వచ్చినప్పుడల్లా కలవడం, ఇలాంటివి కూడా మీ నెట్వర్క్లోభాగమే .
ఉద్యోగాలకు వెళ్లే ముందు బయోడేటా సిద్ధం చేసుకుంటాం . తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాం.
కానీ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.
ఒక ఏడాదిలో మీరు సాధించిన విజయాలు, నేర్చుకున్న అంశాలు అవి చిన్నదైనా సరే రెజ్యూమ్ లో రాసుకోవాలి.
మీరు చేయాలనుకుని చేయలేకపోయిన పనులను ఒకచోట రాసుకోవడం కూడా అవసరమే.
దానివల్ల మీకు మీ కెరీర్ పై ఒక అవగాహన వస్తుంది.
ఉద్యోగంలో మీరు సాధించాలనుకున్న మీ పై అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి .
అప్పుడు అవతలి వాళ్లకు మీ పనితీరు పట్ల కొంత అవగాహన వస్తుంది.
అవసరమైనప్పుడు వారి నుంచి సాయం అందుతుంది.
సీనియర్ల నుంచి సూచనలు పొందడం, నైపుణ్యాలు పెంచుకోవడం అనేది ఇన్నాళ్లు చేసే ఉంటారు.
ఇకపై మీరు నేర్చుకున్న అంశాలను ,కొత్తగా చేరిన ఉద్యోగులతో పంచుకోండి. అది వాళ్లకే కాదు మీకు ఉపయోగపడుతుంది.