నీ సంకల్పమే . . . నీ ఆయుధం . . .శ్రీ శ్రీ

Published on August 30, 2019

శ్రీ శ్రీ గారు రాసిన ఈ వాక్యాలు కలంతో వ్రాసినవి కావు. ప్రతి మనిషి యొక్క మనసుని కదిలించేటటువంటి , స్ఫూర్తిని కలిగించి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అడుగులు వేయడానికి తన మనసులోని భావాలను అక్షరరూపంలో మనకోసం వ్రాసిన అద్భుత కవి .

కుదిరితే పరిగెత్తు . . .

లేకపోతే నడు . . .

అది చేతకాకపోతే . . . పాకుతూ పో . . .

ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు . . .

ఉద్యోగం రాలేదని . . .

వ్యాపారం దెబ్బతిందని . . .

స్నేహితులు మోసం చేశారని . . .

ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని . . .

అలా ఉండి పోతే ఎలా . . .

దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే . . .

తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళ ని తలదించుకునేలా చేసే సత్తా నీది . . .

ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా. . .

సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు . . .

పారే నది . . . వీచేగాలి . . . ఊ గే చెట్టు . . . ఉదయించే సూర్యుడు . . .

అనుకున్నది సాధించాలనే నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురు తో సహా . . .

ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు . . . లే బయలు దేరు . . .

నిన్ను కదలనివ్వకుండా చేస్తున్న. . . మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. . .

పడ్డ చోట నుండే పరుగు మొదలు పెట్టు . . .

నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకొనే ముందే బద్దకాన్ని వదిలేయ్ . . .

నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో . . .

నీ నీడ నిన్ను వదిలి వేయకముందే వెలుగులోకి వచ్చేయ్ . . .

మళ్లీ చెప్తున్నా . . . కన్నీళ్లు కారిస్తే కాదు . . .

చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర వ్రాయగలనని తెలుసుకో . . .

చదివితే ఇవి పదాలు మాత్రమే . . . ఆచరిస్తే ఇవి అస్త్రాలు . . .

                                                                     . . .   శ్రీ శ్రీ 

error: Content is protected !!
Enjoyed this video?
sri sri
"No Thanks. Please Close This Box!"