మహేష్ బాబు స్పందన మీ కోసం . . .
ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్యకాంతి లా మెరుస్తుందో . . .
ఎవరి మాట మన్ననగా ఉంటుందో . . .
ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో . . .
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో . . .
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం . . . సమాజంలో గౌరవం ఉంటాయో . .
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో . . .
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో . . .
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో . . .
స్త్రీకి శక్తి ఉంది . . గుర్తింపు ఉంటుంది . . . గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో . . .
ఎవరికి దగ్గరగా ఉంటే . . వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో . . .
అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు . . .
ఒక్క మాటలో చెప్పాలంటే . . వాడే మగాడు . . .