అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం, ఊబకాయం తో బాధపడే వారు అన్నం తక్కువ తినాలి అనుకుంటున్నారా ?
మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలంటే ? ఈ పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వచ్చు.
దంపుడు బియ్యం:
వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సాధ్యమవుతుంది .
మధుమేహంతో బాధపడే వారికి ఎంతో మంచిది.
రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది.
అరుగుదల బాగుంటుంది.జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
అటుకులు:
తక్కువ తీసుకున్న పొట్ట నిండిన భావన కలుగుతుంది.త్వరగా అరుగుతుంది.
రక్తహీనత ఉన్నవారికి చక్కటి ఆహారం. అటుకులతో ఇనుము సమృద్ధిగా లభిస్తుంది.
వీటితో ఉప్మా చేసుకోవచ్చు. ఉడికించిన కూరగాయ ముక్కలతో కలిపి తీసుకోవచ్చు.
తృణధాన్యాలు:
అన్ని రకాల తృణధాన్యాలు కలగలిపి ప్యాకెట్ల రూపంలో మార్కెట్లో లభిస్తున్నాయి.
అలాగే ఉడికించుకొని తినవచ్చు ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది.
ఈ ఆహారంతో తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
కాలీఫ్లవర్ అన్నం:
బియ్యం తక్కువగా, కాలీఫ్లవర్ ముక్కలు ఎక్కువగా వేసి అన్నం వండుకోవచ్చు.
దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
ఇలా వారానికి ఒకసారి తీసుకోవచ్చు.
కొర్రలు:
కొవ్వును కరిగించి, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడంలో కొర్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఉడికించి తీసుకోవచ్చు.
అంత రుచిగా లేవనుకుంటే కాసిని బియ్యం కలిపి ఉడికించి తినవచ్చు.
వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి.