ప్రేమలో పడ్డప్పటి గిల్లికజ్జాలు, పెళ్లయిన కొత్తలోని అల్లరి, మూతి విరుపులు ఇవన్నీ ఒక దశలో ఆగిపోతాయి.
ఒకరి మీద ఒకరికి ఏదో తెలియని అసంతృప్తి రాజుకుంటుంది.
ఆ ఘర్షణలు తగ్గి,మళ్లీ ఇద్దరి మధ్య నమ్మకం కలగాలంటే , ఒక దారి ఉంది.
అదే “థాంక్స్” చెప్పడం.
బయట వాళ్ళు ఒక చిన్న సాయం చేసిన యధాలాపంగా చెప్పేసే ఈ చిన్నమాట భార్యాభర్తల మధ్య అసలు వినిపించడమే లేదు.
కానీ ఆ మాటే భార్యభర్తల మధ్య సంబంధాల మెరుగుకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది.
థాంక్స్ అనే మాట ఎదుటి వాళ్ళు మీ కోసం చేసిన పనికి మీరిచ్చే ఓ గుర్తింపు, అభినందన కూడా.
బయటకు చెప్పకున్నా ప్రతి మనిషి దానిని కోరుకుంటారు.
ఎదుటి వాళ్లు తనకెంతో విలువ ఇస్తున్నారని సంతోషిస్తారు.
ముఖ్యంగా దాంపత్యంలో ఘర్షణలు, ప్రతికూల భావాలతో కొట్టుమిట్టాడుతున్న దంపతులను “థాంక్స్” దగ్గర చేస్తుంది. ఆలోచించేలా మారుస్తోంది.
పెళ్లి అయినప్పటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా (మరీ అతిగా కాదండోయ్) ఎదుటి వారికి థాంక్స్ చెప్పగలిగితే అనుబంధంలో పెద్ద సమస్యలు రావు.