కొవిడ్ (కరోనా ) . . ముందు జాగ్రత్తగా . . .

కొవిడ్ (కరోనా ) తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్ : 040 – 24651119

ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకి మనవి :

  • చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఎవరితోటి కరచాలనం లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం చేయకండి.
  • జన సమూహాల మధ్య తిరుగుతున్నప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకోవడం లేదా స్కర్ఫ్ లేదా కర్చీఫ్ కట్టుకోవడం మంచిది.
  • జ్వరము, జలుబు , దగ్గు ఉన్న వారికీ దూరంగా ఉండడం మంచిది .
  • ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకండి.
  • ఏమైనా దూరప్రాంత ప్రయాణాలు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది.
  • కొంచెం ఎండలు తీవ్రత పెరిగే వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ముందు జాగ్రత్తగా :

మూడు గ్లాసులు నీళ్లల్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించి , ఒక గ్లాస్ నీళ్లు అయ్యే వరకు వేడి చేసి ఆ నీళ్లను రోజు రెండు పూటల త్రాగండి .

arsenic album 30 ( ఆర్సెనిక్ ఆల్బం 30 ) అనే హోమియోపతి మందుని ఉదయం 5 మాత్రలు, సాయంత్రం 5 మాత్రలు వేసుకోవాలి.

ఈ హోమియోపతి మందు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఈ మందు వేసుకునే అరగంట ముందు, అరగంట తర్వాత ఏమి తినకూడదు.

అశ్రద్ధ వద్దు . . .

ఈ క్రింది లక్షణాలు ఉన్నవారు వైద్య పరీక్షల ఫలితాలు వెల్లడి అయ్యే వరకూ బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటివి చెయ్య కూడదు.

ముక్కు కారడం , తుమ్ములు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఛాతీలో నొప్పి, తలనొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం.

రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు ఉంటే కొవిడ్ (కరోనా ) లక్షణాలుగా అనుమానించాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

జలుబు, ముక్కు కారడం, జ్వరం వస్తే తక్షణమే డాక్టర్ ను సంప్రదించాలి.

ఇంటిపట్టున ఉంటేనే మేలు.

బయటకు వెళ్లాల్సి ఉన్నప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవడం వంటివి చేయాలి.

ఈ వైరస్ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే , మీ దగ్గరికి ఈ వైరస్ రాదు.

పరిశుభ్రంగా ఉండడం, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం  ఈ వ్యాధి రాకుండా ఉండడానికి  ప్రధానమైన మందు.

కొవిడ్ (కరోనా ) తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్ : 040 – 24651119

 

error: Content is protected !!