#Sarileru Neekevvaru

#Sarileru Neekevvaru సరిలేరు నీకెవ్వరు . . . 11 Jan 2020 న విడుదల

‘సరిలేరు నీకెవ్వరు ‘  జనవరి  11 వ తేది న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన ముఖ్య తారాగణంగా, విజయశాంతి గారు పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్రొఫెసర్ భారతీ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో కొన్ని విశేషాలు మీ కోసం:

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి గారు ఈ సినిమాలో నటించారు. 

మహేష్ బాబు , విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు వేరే స్థాయిలో ఉంటాయని ఇటీవల ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చే ఈ సినిమా యొక్క ప్రథమార్థంలో ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు, హీరోయిన్ రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదాన్ని  పంచుతాయి.

ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనకు స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తారు.

ఈ సినిమాలో ప్రత్యేకమైనటువంటి పాట లో మిల్కీ బ్యూటీ ‘ తమన్నా ‘ కనిపిస్తారు. ఆ పాట మీకోసం. . .

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాలో చాలా కీలక పాత్ర వహించింది. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి.

జనవరి 11వ తేదీన ఈ సినిమాను ఎంజాయ్ చేయటానికి రెడీగా ఉండండి . డైరెక్టర్ అనిల్ రావిపూడి ” బొమ్మ దద్దరిల్లిపోతోంది” అని అంటున్నారు. చూద్దాం మరి.

 

error: Content is protected !!